|
| యువత రివ్యూ |
యువత ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చాయి. అదే బాటలో వచ్చిన మరో చిత్రమే ఈ "యువత". స్నేహం విలువను తెలియజేస్తూ మానవీయ సంబంధాలకు ఈ సినిమాలో పెద్దపీట వేశారు. దీనికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించారు. నిఖిల్, అక్ష, జయప్రకాష్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, షాయిజీ షిండే, శివన్నారాయణ, జీవ, అతిథి పాత్రల్లో సిద్ధార్థ, కృష్ణుడు తదితరులు నటించిన ఈ సినిమాకు పరుశురాం (బుజ్జి) దర్శకుడు. హరి ఉమాప్రకాష్ నిర్మాత.
కథ: బాబు (నిఖిల్) టెన్త్ క్లాస్ తర్వాత చదువును గాలికొదిలేసి.. అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కేశవపురం అనే గ్రామంలో తన మేనమామ (శివన్నారాయణ) ఇంట్లోనే ఉంటాడు. బాబు పనులు నచ్చకపోవడంతో మేనమామ ఆగ్రహానికి గురై, తన స్నేహితుల దగ్గరే ఉంటానని హైదరాబాద్‌కు మకాం మారుస్తాడు. అతని స్నేహితుల ముగ్గురికీ ఒక్కో వ్యాపకం ఉంటుంది. ఒకతను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు.
మరొకరు సెక్యూరిటీ గార్డ్. ఇతను పోలీసు అధికారి కావాలని, మరో స్నేహితుడు దర్శకుడవ్వాలని ప్రయత్నాలు సాగిస్తుంటారు. అందరికీ ఏదో ఒక గోల్ ఉంటుంది. ఏ గొడవా లేనివాడు బాబు ఒక్కడే. ఈ దశలో బేబి (అక్ష) అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్‌ను చూసి బాబు ప్రేమలో పడతాడు. తన పుట్టినరోజు ఫంక్షన్‌కు వీరందరినీ బేబి ఆహ్వానించింది. ఆ సమయంలో వేరే వర్గంతో బాబు బ్యాచ్ గొడవపడతారు. ఇదిలా ఉండగా, స్నేహితుడికి దర్శకుడయ్యే అవకాశం వచ్చిన వార్తను చెబుదామని వస్తున్న బాబును గతంలో గొడవ పడ్డ గ్యాంగ్ చితగ్గొడతారు. దీంతో అతని పరిస్థితి విషమిస్తుంది. ఆపరేషన్ చేస్తేగానీ బతకడని డాక్టర్ చెబుతారు.
ఆపరేషన్ కోసం అప్పటికప్పుడు ఐదులక్షలు కావాలి ఎలా... అని ఆలోచిస్తుండగా గూండా ముసుగులో వడ్డీ వ్యాపారం చేస్తున్న నర్సింగ్ యాదవ్‌ను ఆశ్రయించి స్నేహితులు బాబుకు ఐదులక్షలతో ఆపరేషన్ చేయిస్తారు. డబ్బును తిరిగి చెల్లించలేక... బాబు తన స్నేహితులతో కలిసి బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేస్తాడు. సరిగ్గా వీరు వెళ్లేసరికి మరో ముఠా దోపిడీ చేసి పారిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం బాబు, అతని స్నేహితులు చిక్కుతారు. ఇక ఆ తర్వాత వారి పరిస్థితి ఏమిటి... శిక్ష అనుభవించారా... లేదా... అసలు బ్యాంక్ దోపిడీ చేసిన ముఠా ఎవరు... ఇవన్నీ తెలుసుకోవాలంటే... మిగిలిన సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: కథా పరంగా చూస్తే... గతంలో వచ్చిన సినిమాలను గుర్తుకు తెచ్చినా దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి బోర్ లేకుండా సినిమా తీయగలిగారు. "హ్యాపీడేస్"తో వెలుగులోకి వచ్చిన నిఖిల్ తరువాత హీరోగా "అంకిత్ అండ్ పల్లవి అండ్ ఫ్రెండ్స్" చేశాడు. అయితే "యువత" అతనికి నటుడిగా మంచి పేరు సంపాదించి పెడుతుంది. నిఖిల్ గోదావరి ప్రాంతానికి చెందిన వాడు గనుక ఆ యాసతో బాగానే డైలాగ్‌లు చెప్పాడు. ఇక హీరోయిన్‌గా చేసిన లక్ష కొత్తైనా నటనతో ఆకట్టుకుంది. స్నేహితులుగా చేసిన రణదీర్, విజయ్, పాండు పరవాలేదనిపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|