యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
కేక- రివ్యూ
Keka Still
PC
"చిత్రం", "నువ్వునేను", "జయం" వంటి వరుస విజయాలతో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ అనంతరం రూపొందించిన చిత్రాలేవీ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. స్టార్ హీరో మహేష్ బాబుతో "నిజం" చేసినా అది కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను రంజిపచేయలేకపోయింది. తాజాగా ఆయన పట్టుదలతో "కేక" తీసినా, ఈ సినిమా కథలో పట్టు లేదని టాక్ వచ్చింది.

రాజా (సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు), అనూప్ కుమార్, ఇషానా, ధర్మవరపు, దువ్వాసి మోహన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన తారాగణం. కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: చక్రి, ఎడిటింగ్: శంకర్, పాటలు: సీతారామశాస్త్రి, వేటూరి, చంద్రబోస్, నిర్మాత, దర్శకత్వం: తేజ. ఈ సినిమా అక్టోబరు 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:
అనాధ బాలల నేపథ్యంలో సినిమా కథ మొదలవుతోంది. కలకత్తాలో ముగ్గురు అనాథలు పెట్టాబేడా సర్దుకుని పారిపోతుండగా అర్జున్ (రాజా) వారి వెంటబడి అనాధ ఆశ్రమానికి తీసుకువస్తాడు. ఆశ్రమాన్ని బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ప్రముఖుల సమక్షంలో వీరిచేత సంగీత పోటీ నిర్వహించి ఆశ్రమానికి నిధులు సమకూర్చుకోవాలని నిర్వాహకుడు భావిస్తుంటాడు.

ఇది గ్రహించిన ఆ ముగ్గురు అనాథలు ఒక రోజు రాత్రిపూట మళ్లీ పారిపోయే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో రాజాను కొంతమంది గూండాలు చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని గ్రహించి వారు వెనక్కి వచ్చి మిగిలిన అనాథల్ని నిద్రలేపుతారు. దీంతో గూండాలు పారిపోవడం, రాజా కత్తిపోట్ల బారిన పడడం జరుగుతుంది. దీంతో రాజాను ఎవరు చంపాలనుకున్నారనే ప్రశ్న అందరికీ తలెత్తుంది. అక్కడ కట్ చేస్తే... రాజా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

కాలేజీ సెలవులకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన రాజాకు, తన మాదిరిగానే ఇంటికి వచ్చిన సుజాత (ఇష్టానా) కనిపిస్తుంది. సుజాత ఆ ఊరిపెద్ద కుమార్తె. రాజా తన గ్యాంగ్‌తో చేపలు పడుతున్న సమయంలో సుజాత చూసి ఆనందించి వారితో స్నేహం చేస్తుంది. ఆ స్నేహం ముసుగులో రాజా, సుజాత మధ్య ప్రేమ చిగురిస్తుంది.

ఈ విషయం తెలిసి సుజాత తండ్రి తన స్నేహితుడి కొడుకు కిరణ్ (అనూప్ కుమార్)తో సుజాతకు పెండ్లి నిశ్చయం చేస్తాడు. అనూప్ కుమార్, రాజా హైదరాబాద్‌లో ఒకే కాలేజీలో చదివే స్నేహితులు. ఆ విషయం సుజాతకు తెలిసినా రాజానే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది. అసలు విషయాన్ని కిరణ్‌కు చెప్పమని సుజాత అర్జున్‌కు చెబుతూ ఉంటుంది.

పెండ్లి సమయం దగ్గరపడినా చెప్పకపోవడంతో అర్జున్‌పై సుజాత కోపగించుకుంటుంది. ఆఖరికి అర్జున్ తన ప్రేమ గురించి కిరణ్‌కు చెప్పేస్తాడు. ఇది చాలా చిన్న విషయమని, ఇద్దరి పెండ్లి తాను దగ్గరుండి చేయిస్తానని కిరణ్ మాటిస్తాడు. మరి కిరణ్ తన మాట నెరవేర్చాడా.. లేదా.. అనేది సస్సెన్స్. మరి అర్జున్ కలకత్తా వెళ్లి అనాథలను సంగీత పోటీలకు ఎందుకు సిద్ధం చేస్తున్నాడనేది... తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమాలో రెండు కథలుంటాయి. మొదటిది అర్జున్ ప్రేమకథ. రెండోది అనాధల కథ. రెండు కథల్ని లింకు చేస్తూ రూపొందించిన "కేక"కు ఆశించిన స్పందన తీసుకురావడంలో తేజ వెనుకబడ్డారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజా నటన. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకుగా "ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ" చిత్రంతో ఇతను నటుడిగా పరిచయం అయ్యాడు.

పాత్రకు తగినట్లుగా తగిన నటనను చక్కగా పండించాడు. ఇంకా కొంచెం శ్రద్ధ పెడితే మంచి నటుడవుతాడు. ఇక కొత్తమ్మాయి ఇషానా బాలీవుడ్ తరహా నటిగా కన్పిస్తుంది. తనకిచ్చిన పాత్రమేరకు నటించినా... విషాద సన్నివేశాల్లో నటించడంపై ఆమె మరింత దృష్టి పెట్టాలి. మరో హీరో అనూప్ పెర్‌ఫార్మెన్స్ బాగానే ఉంది. అతనిలో నెగటివ్ షేడ్స్ కనిపించడంతో ఇతనే విలన్ అనే అనుమానం రాక మానదు.

సినిమాటోగ్రఫీ పి.సి. శ్రీరామ్ విలేజ్ ఎపిసోడ్స్‌ను బాగా తెరకెక్కించారు. ఆయన పనితనం బాగా కనిపించింది. సంగీత దర్శకుడు చక్రి బాణీలు బాగానే ఉన్నాయి. "నా దారిలో నువ్వే... వర్షంలో నువ్వే..." అనే పాట ఆకట్టుకుంటుంది. సాహిత్య పరంగా అన్ని పాటలు బాగానే ఉన్నాయి. టైటిల్ సాంగ్ "కేక" చక్రి ఆలపించినా రీరికార్డింగ్ హోరులో స్పష్టత లోపించింది.

ఇకపోతే తేజ గత చిత్రాల కథలో ఉన్న పట్టు "కేక"లో ఏమాత్రం లేదని చెప్పాలి. ఈ తరహా ముక్కోణపు ప్రేమకథలు చాలా వచ్చాయి. కొత్తదనమంటూ ఏమీ లేదు. కేవలం సినిమాటోగ్రఫీ, సంగీతం చిత్రాన్ని ఏమాత్రం విజయవంతం చేయలేవని తెలుసుకుంటే బాగుండేదేమో. "చిత్రం" నుంచి టీనేజ్ లవ్‌స్టోరీపై దృష్టిపెట్టిన తేజ ఈసారి టీనేజ్ తర్వాత వయస్సువారిని ఎంచుకున్నాడు. సినిమా ఆరంభంలో కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉన్నా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ ప్రేక్షకుడికి రొటీన్ సినిమాలను గుర్తుకు తెస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆకట్టుకోని త్రీ
మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు
రెయిన్‌బో- రివ్యూ
చింతకాయల రవి రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
మల్లెపువ్వు రివ్యూ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కేక- రివ్యూ
చిత్రం", "నువ్వునేను", "జయం" వంటి వరుస విజయాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ...
ఆకట్టుకోని త్రీ
మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు
భవిష్యత్
తారాఫలం - దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా...
ఇంకా చదవండి|మరిన్ని...