|
| ఆకట్టుకోని త్రీ |
"ఎ ఫిలిం బై అరవింద్" దర్శకుడు శేఖర్‌సూరి చేసిన మరో చిత్రమే "త్రీ". ఆద్యంతం సస్పెన్స్‌తో హాలీవుడ్ సినిమాను చూసినట్టుగా ఉండే ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అయితే శేఖర్‌సూరి రెండో చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. టైటిల్ వెరైటీగా ఉందేమోగానీ, ముచ్చటగా మూడు రోజుల సినిమా అని ఇప్పటికే టాక్ వచ్చేసింది.
రాజీవ్ కనకాల, రిషి, శాంతిచంద్ర, ఊర్వశీశర్మ, రవళి, రంగనాథ్, బెనర్జీ, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రం రాజ్ (ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కింది. ఫణిరాజ్, జి.ఎస్.బాబు నిర్మాతలు. శేఖర్ సూరి సస్పెన్స్ మంత్రం ఈసారి బెడిసికొట్టింది. రిగ్రేషన్ అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ప్రవేశపెట్టాడు. ఈ పదానికి అర్థం దాదాపుగా ఎవరికీ తెలీదు. గత జన్మల తాలూకు పోకడలు ఈ జన్మలోనూ ఉంటాయనేది దీనర్థం. ఇది సామాన్య ప్రేక్షకుడికి ఏ మాత్రం అర్థంకాకపోవడం "త్రీ"కి శాపమైంది.
కథ: నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో పని చేస్తుండే వ్యక్తి శ్రీరామ్ పాత్రలో రిషి కనిపిస్తాడు. అతని ఇంటికి సమీపంలోనే నిష (ఊర్వశి శర్మ) ఉంటుంది. ఆమెకు ఫోన్ ద్వారా బెదిరింపులు వస్తుంటాయి. బెదిరింపు కాల్స్ శంకర్ అనే పేరుతో వస్తుంటాయి. నిషకు చంపేస్తానంటూ వచ్చే ఈ బెదిరింపు కాల్స్ బాధను ఎవరూ అర్థంచేసుకోరు. ఓ రోజు శ్రీరామ్ దీనిని గ్రహించి నిషను సైక్రియాటిస్ట్ (హర్షవర్ధన్) దగ్గరికి తీసుకెళ్లి విషయం చెబుతాడు.
సైక్రియాటిస్ట్ దగ్గర నిష చెప్పిన విషయం శ్రీరామ్‌కు ఆసక్తి కలిగిస్తుంది. దీంతో శంకర్ అనేవాడు ఎవరో తెలుసుకోవాలని శ్రీరామ్ ప్రయత్నిస్తాడు. ఆమె గత జన్మతాలూకు ఛాయలతో శంకర్‌కు ఏదో సంబంధముందని సెక్రియాటిస్ట్ హర్షవర్ధన్ గ్రహిస్తాడు. ఈ కోణంలో ప్రయత్నించి రహస్యాన్ని ఛేదిస్తాడు. అది ఎలా... ఏమిటి... అనేదే "త్రీ" సినిమా.
విశ్లేషణ: టైటిల్‌కు కథకు ఏమాత్రం సంబంధం లేదు. కొత్తదనం కోసం రిషి పచ్చబొట్లతో కన్పిస్తాడే తప్ప ప్రత్యేకించి ఏమీలేదు. రాజీవ్ కనకాల పాత్ర కేవలం పెట్టాలని పెట్టినట్లుంది. చిత్రం మొత్తంమీద సైక్రియాటిస్ట్‌గా కనిపించే హర్షవర్ధన్ పాత్ర బెటర్. ఊర్వశివర్మతో పాటు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ ఓ పాత్రలో నటించాడు. ఇకపోతే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. బెలూన్ లైట్ల ద్వారా (ఖర్చుఎక్కువ) ఎఫెక్ట్స్‌ను బాగా చూపించాడు.
"త్రీ"లో దర్శకుడు శేఖర్ సూరి పట్టుతప్పినట్టు అనేకసార్లు అనిపిస్తుంది. చాలాచోట్ల క్లారిటీ దెబ్బతింది. ద్వితీయార్ధంలో తాను చెలనుకున్న పూర్వజన్మ తాలూకు విషయాల్లో స్పష్టత లేకుండా గందరగోళం సృష్టించాడు. ఏ విషయాన్ని చెప్పాలనుకున్నాడో దాన్ని సరిగ్గా చూపించలేకపోయాడు. ఇటువంటి కథల్ని సినిమాగా మలిచేటప్పుడు హోమ్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ త్రీలో అటువంటిదేమీ లేదు. గత జన్మలో క్రూరుడైన వ్యక్తి ఈ జన్మలో మామూలుగా ఉన్నా రిగ్రేషన్ థెరపీ పూర్తయ్యేసరికి మళ్లీ క్రూరుడుగా మారుతాడు. ఇదేమిటో సామాన్యులకు ఒకపట్టాన అర్ధం కాదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా... |
| |
|
|
|
|
|
|
|