|
| మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు |
| శనివారం, 11 అక్టోబర్ 2008 ( 12:02 IST ) | |
స్వప్న (అక్షర) అనే అమ్మాయి కిషోర్ నిన్ను చూడాలని ఉంది. నేను వస్తున్నా అంటూ చెబుతుంది. ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలియకపోయినా ఎయిర్‌ఫోర్ట్‌లో ఆమెను కలుస్తాడు విజయ్. కిషోర్ అంటూ విజయ్‌ను పలకరించిన స్నప్న అతనితో సరదాగా గడుపుతుంది. అలాంటి తరుణంలో పూర్ణ అనే రౌడీ ఫోన్ చేసి డబ్బు తీసుకుని ఎంతకాలం తప్పించుకు తిరుగుతావ్ నువ్వు ఎక్కడున్నా నా మనుషులు నిన్ను చంపేస్తారంటూ బెదిరిస్తారు.
అదేసమయంలో బాబూ నా ఆరోగ్యం క్షీణించింది ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఇస్తానన్నావ్ మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాం అంటూ కిషోర్ తల్లి నుంచి ఫోన్ వస్తుంది. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్ ఉక్కిరిబిక్కిరవుతాడు. ఆటుపై విజయ్ ఏం చేశాడు. ఆ సమస్యలనుంచి ఎలా బయటపడ్డాడు. అసలు కిషోర్ ఎవరు అతను ఎందుకు చనిపోయాడు. అతనికి అంత డబ్బు ఎక్కడిది అన్న విషయాలతో కథ కాస్త వేగంగానే నడుస్తుంది.
ఈ సినిమా గురించి విశ్లేషించాలంటే మనిషికి కోటి ఆశలు. అవి ఎప్పటికీ తీరవు. అలాంటి ఆశలు గల ఓ యువకుడి జీవిత కథే నిన్న నేడు రేపు చిత్రం. అంటూ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ చిత్రం చెప్పాలనుకున్న పాయింట్‌ను చెప్పడంలో బాగానే సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.
విజయ్ పాత్రకు రవికృష్ణ బాగా సరిపోయాడు. ఈనాటి ప్రపంచంలో కోర్కెలు తీర్చుకోలేక సతమతమయ్యే యువకుల పరిస్థితిని తన పాత్ర ద్వారా రవికృష్ణ చక్కగా చూపించాడు. అలాగే స్వప్న పాత్రలో అక్షర కూడా బాగానే నటించింది. సినిమాలో ఎక్స్‌ఫోజింగ్ కోసం అక్షర బాగానే ఉపయోగపడింది.
ఇక అత్తగారి ఆర్థికసాయం పాత్రలో బ్రహ్మానందం పాత్ర కామెడీని పండించింది. భూములను కబ్జా చేసే పాత్రలో నాజర్, అతని బావమరిది పాత్రలో వేణుమాధవ్‌లు కూడా చక్కని ప్రతిభ కనబరిచారు. అనిల్ బాణీలు సైతం ఈ చిత్రాన్ని ప్రేక్షకుడికి దగ్గర చేయడంలో సహకరిస్తాయి. ఇంతకుముందు హైదరాబాద్ నవాబ్స్ చిత్రం ద్వారా పరిచయమైన లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రంలోనూ తన ప్రతిభను చూపించాడు. మొత్తం మీద ఈ నిన్న నేడు రేపు చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|