|
| మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు |
| శనివారం, 11 అక్టోబర్ 2008 ( 12:01 IST ) | |
రవికృష్ణ, తమన్నా, అక్షరలు జంటగా ఎస్పీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన చిత్రం నిన్న నేడు రేపు. సౌమ్య, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, వైజాగ్ ప్రసాద్, అజయ్, లక్ష్మీపతి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
డబ్బే ఆధారంగా ఉన్న ఈ లోకంలో పల్లె నుంచి పట్నం వచ్చిన ఓ కుర్రాడి జీవితం చివరకు ఎలాంటి మలుపులు తిరిగిందనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. కథా విషయానికొస్తే... విజయ్ (రవికృష్ణ) నిరుద్యోగి. సాప్ట్‌వేర్ ఉద్యోగి కావాలనుకుని పల్లె నుంచి పట్నానికి వస్తాడు. పట్నంలో డబ్బే లోకంగా కాలంతో పోటీపడుతూ పరుగులు తీసే జనాలను చూచి అలాగే బ్రతకాలని ఆశపడుతాడు.
అయితే ఏం కావాలన్నా డబ్బు కావాలనే విషయం త్వరలోనే విజయ్‌కు బోధపడుతుంది. అదే సమయంలో అతను ప్రేమించిన ఆశ (తమన్నా) సైతం డబ్బులేని నిన్ను ప్రేమించలేనంటూ విజయ్‌కు దూరమవుతుంది. దీంతో మనస్థాపం చెందిన విజయ్ చచ్చిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఆలోచనతోటే ఓ అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పడుకుంటాడు.
అంతలో దూరంగా ఎదో వెలుగు కన్పించడంతో అటువైపు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన విజయ్‌కు అది సెల్‌ఫోన్ అని తెలుస్తుంది. ఆ ఫోన్ పక్కనే ఓ వ్యక్తి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. అది చూచి భయపడుతూనే అతని జేబుల్లో వెతుకుతాడు విజయ్. అలా వెతికిన విజయ్‌కి ఆ వ్యక్తి జేబులో వేలరూపాయల డబ్బుతోపాటు క్రెడిట్ కార్డులు లాంటివి దొరుకుతాయి.
దాంతో వాటిని తీసుకుని తన రూంకు చేరుకుంటాడు. ఇక ఆ క్షణం నుంచి చేతిలో ఉన్న డబ్బు, క్రెడిట్ కార్డుల సాయంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దర్జాగా బ్రతకడం ప్రారంభిస్తాడు విజయ్. అలా గడుస్తున్న తరుణంలో ఓ రోజు విమానం బొమ్మ చూచి విమానం ఎక్కి విదేశాలకు వెళ్లాలనుకుంటాడు విజయ్. దాంతో ఓ బ్రోకర్ని కలుస్తాడు.
ఐదు లక్షలు తెస్తే వీసాతో సహా విదేశాలకు పంపిస్తానని ఆ బ్రోకర్ విజయ్‌కు చెబుతాడు. అయితే అంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని విజయ్ ఆలోచిస్తున్న సమయంలో అతనికి దొరికిన సెల్‌ఫోన్‌కు ఓ కాల్ వస్తుంది. ఓ మార్వాడీ ఫోన్ చేసి రేపు తొమ్మిది గంటలకు ఫలానా చోటుకు వస్తే ఐదు లక్షలు ఇస్తానని ఫోన్‌లో చెబుతాడు. అదేసమయంలో విజయ్‌కు మరో ఫోన్ వస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|