|
| రెయిన్‌బో- రివ్యూ |
రాహుల్, సోనాల్ చౌహాన్, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన "రెయిన్‌బో" చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శివారెడ్డి, సునీల్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లికార్జున రావు, గొల్లపూడి మారుతీరావు, ఉత్తేజ్, దీక్షిత్ మాస్టర్, పావలా శ్యామల, హేమ, మాస్టర్ భరత్ తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు.
మిత్రులుగా ఉండే శ్యామ్ (రాహుల్)- కమల (సింధుమీనన్), మధ్యలో హీరోయిన్ కావాలనే ఆశయంతో హీరోకు పరిచయం అయ్యే స్వప్న చుట్టూ తిరిగే కథే ఈ సినిమా. ఈ సినిమాకు కథ: బలభద్రపాత్రుని రమణి, సంగీతం: నిహాల్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సంతోష్ శ్రీనివాస్, నిర్మాత, దర్శకుడు: వి.ఎన్. ఆదిత్య.
కథ: శ్యామ్ అని ముద్దుగా పిలువబడే శ్యామలారావు (రాహుల్) ఓ అనాధ. ఇతనొక మంచి చిత్రకారుడు. ఇతని పొరిగింటిలో కమల (సింధుమీనన్) ఉంటుంది. శ్యామ్‌కు ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం, కోపమొస్తే కొట్టడాన్ని కమల బాధ్యతగా భావిస్తుంటుంది. ఈ ఇద్దరు చనువుగా మెలిగే మంచి మిత్రులు. కమల మూగది. హోర్డింగ్‌లకు పెయింటింగ్‌లు వేసే శ్యామ్‌కు స్వప్న (సోనాల్ చౌహాన్) పరిచయమవుతుంది.
గొప్ప నటుడిని కావాలనే తండ్రి కోరికను తను సార్థకం చేయాలని స్వప్న హైదరాబాద్ వస్తుంది. బాబాయ్ అయిన నారాయణ (ఎం.ఎస్. నారాయణ) ఇంట్లో చేరుతుంది. నారాయణ జూనియర్ ఆర్టిస్ట్‌ల్లో సీనియర్. స్వప్న అగ్రనటి కావాలనే ఆశయానికి శ్యామ్ చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమెకు గుర్తింపు తెచ్చేందుకు తనకు చేతనైన సాయం చేస్తాడు.
ఓసారి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో శ్యామ్ తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దానివల్ల కంటి నరాల్లో రంగులను గుర్తించే నరాలు బ్లాక్ అవతాయి. అతనికి ఆక్సిమ్‌టోమ్స్ అనే కళ్లవ్యాధి వచ్చిందని డాక్టర్ ప్రకాష్‌రాజ్ చెబుతాడు. ఆపై అంతా నలుపు, తెలుపుగానే లోకాన్ని చూసే శ్యామ్ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచేస్తాడు.
మరోవైపు శ్యామ్ చేసిన ఒక పని వలన స్వప్నకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రంలో హీరోయిన్ నటించే అవకాశం వస్తుంది. అనంతరం ఆమె పెద్ద స్టార్ అయిపోతుంది. ఆ టైమ్‌లో శ్యామ్ ఇన్నాళ్లు మనసులో దాచుకున్న ప్రేమను ఆమెకు తెలియజేస్తాడు. అయితే నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదని స్వప్న ఆ ప్రేమను తిరస్కరిస్తుంది. ఆ తర్వాత శ్యామ్ పరిస్థితి ఏమిటి.. శ్యామ్‌కు తనవల్లే కళ్ల జబ్బు వచ్చిందని తెలుసుకున్న స్వప్న ఏం చేసింది.. కమల స్థితి ఎలా ఉందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: గతంలో పలు నవలలు రాసిన అనుభవం ఉన్న బలభద్రపాత్రుని రమణి మొదటిసారి ఈ సినిమాకు కథను సమకూర్చారు. ఈ కథ నవలారూపేణా బాగుండేదనిపిస్తుంది. గతంలో వచ్చిన "శివరంజని", "రాజా", "రంగీలా" వంటి ఎన్నో చిత్రాలను రెయిన్‌బో కూడా గుర్తుకు తెస్తుంది. జీవితం అందమైన హరివిల్లు. ఏది జరిగినా దానిని ఆస్వాదించుకుంటూ జీవితంలో ముందుకు సాగండనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| వాస్తు - ఇంటి నిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంపిక చేసుకోవాలో భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. |
| |
|
|
|
|
|
|
|