|
| చింతకాయల రవి రివ్యూ |
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. "చింతకాయల రవి" సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. అమెరికా నేపథ్యాన్ని జోడించడంతో సినిమాలో వైవిధ్యం కనిపిస్తుంది. తల్లిమనస్సును బాధపెట్టకుండా హీరో చేసిన విన్యాసాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. విక్టరీ వెంకటేష్ మరోసారి తన అభిమానులను సంతృప్తిపరచారనే చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో వెంకటేష్, మమతా మోహన్ దాస్, అనుష్క హీరోహీరోయిన్లు. సునీల్, అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మి, చంద్రమోహన్, వేణు, ఎన్టీఆర్ (గెస్ట్), ఆర్తీ చాబ్రియా, సుమన్ శెట్టి, ప్రదీప్ శక్తి, రవికుమార్ తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, కథ, మాటలు: కోన వెంకట్, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్.
కథ: సంపాదనకోసం అమెరికా వెళ్ళిన చింతకాయల రవి (వెంకటేష్) ఒక బార్‌లో వెయిటర్‌గా చేరతాడు. ఇక్కడ ఉండే తల్లిదండ్రులు లక్ష్మీ, చంద్రమోహన్‌ల దృష్టిలో చింతకాయల రవి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉద్యోగం ఉన్న కుమారుడికి మంచి సంబంధం చూసి పెండ్లి చేసేద్దామని వాళ్లు తీర్మానించుకుంటారు. రవికి ఒక పెద్దింటి సంబంధాన్ని చూస్తారు.
ఆ అమ్మాయి పేరు లావణ్య (మమతా మోహన్ దాస్). తండ్రి షాయాజీ షిండే. ఆయనకు అబద్ధం చెబితే సహించని మనసత్త్వం. రవి పెళ్లి ప్రయత్నాలు నిశ్చితార్థం వరకు వచ్చేసరికి లావణ్య స్నేహితురాలు సునీత (అనుష్క) ద్వారా అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదనే సంగతి బయటపడుతుంది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడిపోతుంది. ఆ కోపంతో సునీతపై ప్రతీకారం తీర్చుకోవాలని వెళ్ళిన చింతకాయల రవి చివరికి ఆమె తండ్రి ప్రాణాల్ని కాపాడతాడు.
అప్పటికే రవి స్నేహితుడు హీరో వేణు ద్వారా సునీత అతని మంచితనాన్ని తెలుసుకుంటుంది. సాధారణంగానే సునీత అతనికి మరింత దగ్గరవ్వాలనుకుంటుంది. కానీ రవి తనను అవమానించిన లావణ్యనే పెండ్లిచేసుకుంటానని, దానికి సునీతను సాయపడమంటాడు. సునీత సాయపడుతున్నట్లే చేస్తూ హీరోకి మరింత దగ్గరవుతుంది. అయితే మరోసారి రవికి, లావణ్యకు పెండ్లి నిశ్చయమవుతుంది. ఆ సమయంలో ఓ సంఘటన జరుగుతుంది. అది ఏమిటి? రవి స్నేహితుడు వేణు పాత్ర ఏమిటి? జూనియర్ ఎన్టీఆర్... ఏ పాత్రలో నటించారు? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ: సాధారణమైన కథాంశం, గమనంలో వైవిధ్యంతో దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమెరికా నేపథ్యం ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. వెంకటేష్ తన పాత్రలో జీవించారు. కొన్ని సన్నివేశాల్లో "మిస్టర్ బీన్"ను తలపిస్తారు. సునీత పాత్రకు అనుష్క, లావణ్యగా మమతామోహన్‌దాస్ బాగా సరిపోయారు.
వేణు, నిఖిత అతిథి పాత్రలో కన్పిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఓ పాటలో కాసేపు కనిపించి ప్రేక్షకులను ఆనందపరుస్తారు. ముంబై నటి ఆర్తీ ఛాబ్రియా ఒక పాటలో కనబడుతుంది. మసాజ్ స్పెషలిస్టుగా అలీ, లక్ష్మీ హాస్యాన్ని పండించారు. "సైబర్ వేవ్" బార్ ఓనర్‌గా పింకీ పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. బాలీవుడ్‌కు చెందిన విశాల్, శేఖర్‌ల ద్వయం అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు బాగున్నాయి. ఎపాయింట్ చిన్నదే అయినా స్క్రీన్‌ప్లేను దర్శకుడు యోగేష్ బాగానే చూపించాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
| చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| వాస్తు - ఇంటి నిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంపిక చేసుకోవాలో భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. |
| |
|
|
|
|
|
|
|