యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
శౌర్యం.. రివ్య్యూ
Gopichand
PC
గోపీచంద్‌ను ఏ తరహా చిత్రాల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో.. సరిగ్గా "శౌర్యం" కూడా అదే తరహాలో ఉంటుంది. ఎక్కువగా ఒకే తరహా కథలను ఎంచుకోవడం గోపీచంద్‌కు అలవాటుగా మారినట్టు కనిపిస్తుంది. "రణం", "యజ్ఞం" చిత్రాలు విజయవంతం అవడం ఇందుకు ప్రేరణ కావొచ్చు. ఇదే ట్రెండ్‌లో జరిగిన మరో ప్రయత్నమే "శౌర్యం". సినిమాలో పెద్దగా కొత్తదనమేమీ కనిపించదు.

"బుజ్జిగాడు", "పోకిరి" చిత్రాల ఛాయలు మాత్రం కనిపిస్తాయి. చెల్లెలు సెంటిమెంట్ మాత్రం భిన్నంగా ఉంటుంది. గోపీచంద్, అనుష్క, పూనమ్‌కౌర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మనోజ్ జైన్, ధర్మవరపు సుబ్రమణ్యం, సుధ, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, నిర్మాత: ఆనంద్‌ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.

కథ:
ఓ వీధి రౌడీ కొడుకు, మరో రౌడీకి మధ్య జరిగే రణమే ఈ సినిమా కథాంశం. దీనికి కొత్తదనం కోసం దర్శకుడు చెల్లెలి సెంటిమెంట్ అద్దాడు. సినిమా కథ కలకత్తాలో ప్రారంభం అవుతుంది. అక్కడ ఓ కాలేజీలో స్టూడెంట్‌గా చేరతాడు విజయ్ (గోపీచంద్). అదే కాలేజీలో శ్వేత (అనుష్క) సీనియర్ హోదాలో విజయ్‌ను ర్యాగింగ్ చేసి, తరువాత అతని ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే దివ్య (పూనమ్‌కౌర్) అనే అమ్మాయికి దగ్గరవ్వాలనుకుంటాడు హీరో.

దివ్య కూడా అదే కాలేజీలో చదువుతుంటుంది. అయితే దివ్య కోసం శివరాం గౌడ్ (మనోజ్ జైన్) అనే రౌడీ కొడుకు అజయ్, అతని అనుచరులు వెతుకుతుంటారు. దీంతో దివ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాడు విజయ్. దివ్యను అలా చూసుకోవడానికి కారణమేమిటి.. చేజారిపోయిన దివ్యను రౌడీ గ్యాంగ్ ఏమీ చేయలేదా.. అసలు దివ్యను రౌడీలు ఎందుకు పట్టుకోవాలనుకున్నారు... మధ్యలో ఈ విజయ్ ఎవరు.. అనేదే మిగిలిన సినిమా.

విశ్లేషణ:
హీరో గోపీచంద్ యాక్షన్‌లో స్పీడ్ తగ్గినట్టు కనిపిస్తుంది. చెల్లలు పాత్ర పోషించిన పూనమ్‌కౌర్ నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అనుష్క పాత్ర బలాదూర్ చిత్రం మాదిరిగానే తాగే సన్నివేశాలతో సాగిపోతుంది. బాడీబిల్డర్‌గా అలీ చేసిన విన్యాసాలు నవ్విస్తాయి. పాటలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. హింసపాళ్లు ఎక్కువ. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మల్లెపువ్వు రివ్యూ
బలహీనమైన కథతో సరోజ
కాలక్షేపానికైతే కాల్ సెంటర్ ఓకే
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్- రివ్యూ
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మల్లెపువ్వు రివ్యూ
"మల్లెపువ్వు" చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకుని...
బలహీనమైన కథతో సరోజ
కాలక్షేపానికైతే కాల్ సెంటర్ ఓకే
భవిష్యత్
తారాఫలం - రాష్ట్ర రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు...
ఇంకా చదవండి|మరిన్ని...