|
| మల్లెపువ్వు రివ్యూ |
| 20 సెప్టెంబర్ 2008 ( 16:16 IST ) | |
"మల్లెపువ్వు" చిత్రం శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకునిగా తనకున్న ఇమేజ్‌ను మార్చుకునేందుకు "మల్లెవువ్వు" వంటి సున్నితమైన టైటిల్‌తో దర్శకుడు సముద్ర చేసిన తాజా ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ టైటిల్‌ను చూసి సినిమా చక్కని లవ్‌స్టోరీ అయివుంటుందని అనుకుంటే పొరబాటే.
ప్రేమకథకు తీవ్రవాదాన్ని ముడిపెట్టి దర్శకుడు ఈ సినిమాలో రక్తపాతాన్ని సృష్టించాడు. మరోవైపు దర్శకుడు తనలో నటుడిని సంతృప్తిపరుచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా ఇందులో చూడవచ్చు. ఈ మధ్యకాలంలో దర్శకులు ఏదో ఒక సన్నివేశంలో కనిపించి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండటం ఎక్కువగానే చూస్తున్నాం. ఈ సినిమాలోనూ దర్శకుడు ఆద్యంతం హీరో స్నేహితుడిగా కనిపిస్తారు.
మురళీకృష్ణ, భూమిక జంటగా నటించిన ఈ సినిమాలో ఆర్.కె (హైదరాబాద్ నవాబ్స్ ఫేం), కోవైసరళ, అభినయశ్రీ, సుకుమార్, సుమన్‌శెట్టి, సమీర్, హేమ సుందర్, ఫర్జానా, గీతాసింగ్, తెలంగాణ శకుంతల తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కెమెరా: అనిల్ భండారి, ఆర్ట్: రమణ, మాటలు: వేమగిరి, సంగీతం: ఇళయరాజా, కథ: రమేష్ వర్మ, నిర్మాత: మోహన్ వడ్లపట్ల, సమర్పణ: ప్రసాద్ రాజు, దర్శకత్వం: వి. సముద్ర.
కథ: కోటి (మురళీకృష్ణ), సూరి (వి.సముద్ర) అనే ఇద్దరు మిత్రులు హైదరాబాద్‌లో భవననిర్మాణ కూలీలుగా పనిచేస్తుంటారు. డబ్బుకూడబెట్టి ఒక్కసారైనా దుబాయ్ వెళ్ళాలని కోటి, చైనా వెళ్ళాలని సూరి కలలు కంటుంటారు. సుమన్‌శెట్టి, అభినయశ్రీ, గీతాసింగ్, హేమ సుందర్‌తో పాటు మరి కొంతమంది కూడా కూలీలుగా పనిచేస్తుంటారు.
ఆర్.కె, కోవైసరళ జంట కూలీ మేస్త్రీ పాత్రలు పోషించారు. పేరుకు కూలీ అయినా కోటి కష్టపడే పనికంటే టీ, కాఫీలు అందించే పని చేస్తుంటాడు. అనుకోకుండా కొత్త కూలీ మల్లి (భూమిక- పురుషుని వేషంలో ఇట్టే గుర్తుపట్టేట్లున్నా అక్కడివారంతా అబ్బాయి అనుకుంటారు) వీళ్ల బృందంలో వచ్చి చేరుతుంది. మల్లి బరువులెత్తలేని స్థితిని చూసి కోవైసరళ టీ, కాఫీలు అందించే ఉద్యోగం మల్లికిస్తుంది.
దీంతో ఇకనుంచి బరువులెత్తే పని చేయాలనే బాధతో మల్లిపై ద్వేషం పెంచుకుంటాడు కోటి. కానీ హీరో ఓ సందర్భంలో మల్లి మగాడు కాదు, అమ్మాయని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఇలా ప్రేమలో తేలుతున్న కోటికి మల్లి కోసం పోలీసులు వెదుకుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు.
వారి నుంచి మల్లిని కాపాడాలనే ప్రయత్నంలో పోలీసులకు చిక్కుతాడు. ఆ తర్వాత సూరి తన స్నేహితులతో కలిసి కోటికి బెయిల్ ఇప్పిస్తాడు. బయటకు వచ్చిన కోటి ఏం చేశాడు... మల్లి ఎక్కడుంది... అసలు మల్లి గతం ఏమిటి... చివరకు కోటి ప్రేమ ఏమైంది... అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ: మొదటి సినిమా అయినప్పటికీ కోటి పాత్రలో హీరో మురళీకృష్ణ పర్వేలేదనిపించాడు. సూరి పాత్రలో దర్శకుడు వి.సముద్ర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ పాత్రలో ఆయనలో నటుని కంటే దర్శకుడే ఎక్కువగా కనిపిస్తారు. మల్లి పాత్రలో భూమిక బాగానే చేసింది. భూమిక తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన పాత్రలను మలిచిన తీరు కూడా పర్వాలేదనిపిస్తుంది.
ఫర్జానా వ్యభిచారగృహంలో డాన్సర్ పాత్ర పోషించింది. ఏవో కొన్ని సన్నివేశాల్లో మినహా హాస్యం కూడా ప్రేక్షకులను నవ్వించే స్థాయిలో లేదనే చెప్పాలి. సినిమాకు సంగీతం, సాహిత్యం హైలెట్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఇళయరాజా. సినిమాలో "గాజులు గాజులు నవ్వులు..." "చందమామ..." పాటలు వినసొంపుగా ఉన్నాయి.
సాంకేతికపరమైన లోపాలు కూడా సినిమాకు శాపంగా మారాయి. డిజిటల్ ఫార్మెట్‌లో చేసిన ఈ చిత్రంలో కలర్ ట్రేడింగ్, లైటింగ్‌లు స్పష్టంగా కన్పించే తప్పిదాలు. సన్నివేశాన్ని నీరుగార్చే విధంగా కెమేరా పనితనం ఉంది. ఈ చిత్ర కథలో ఇటీవలే విడుదలైన బ్లాక్ అండ్ వైట్, ఆదివిష్ణు షేడ్స్ కన్పిస్తాయి. "బరన్" అనే ఇరానీ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | బలహీనమైన కథతో సరోజ | | కిడ్నాప్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన చిత్రం సరోజ. కథాగమనాన్ని... |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - గాంధీ- నెహ్రూ కుటుంబం దేశానికి అందించిన మరో రాజకీయ నేత రాహుల్ గాంధీ. |
| |
|
|
|
|
|
|
|