యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
బలహీనమైన కథతో సరోజ
మంగళవారం, 16 సెప్టెంబర్ 2008   ( 15:57 IST )
Saroja Still
PC
కిడ్నాప్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన చిత్రం సరోజ. కథాగమనాన్ని అద్భుతంగా నడిపించిన దర్శకుడు కథలో పట్టును చూపించలేకపోయాడు. వైవిధ్యం కోసం శ్రీహరి పాత్ర ఉన్నప్పటికీ, ఈ పాత్ర చూసే ప్రేక్షకుడికి గందరగోళాన్ని సృష్టిస్తుంది. పది మందికి సేవ చేయాడం కోసం ఒక పోలీసు అధికారి స్నేహితుడి కుమార్తెను కిడ్నాప్‌ చేయడం ఈ సినిమా కథాంశం.

శ్రీహరి, ప్రకాష్‌రాజ్, కాజల్ అగర్వాల్, నిఖిత, చేరన్, వైభవ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కెమెరా: శక్తిపవన్, ఆర్ట్: విదేష్, మాటలు, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: యువన్ శంకర్‌రాజా, దర్శకత్వం వెంకట్‌ప్రభు.

కథ:
కోటీశ్వరుడైన వ్యాపారవేత్త విశ్వనాథ్ (ప్రకాశ్‌రాజ్) కూతురు సరోజ. విశ్వనాథ్‌కు కుమార్తెను పట్టించుకునే తీరక ఉండదు. ఒక రోజు స్కూల్‌కు వెళ్లిన సరోజ కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో విశ్వనాథ్ స్నేహితుడైన పోలీసు అధికారి (శ్రీహరి) రంగంలోకి దిగుతాడు. కిడ్నాపర్ సరోజను 20 కోట్లిస్తే వదిలేస్తామని షరతు పెడతాడు.

మరోవైపు భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చెన్నై నుంచి గణేష్, స్వామి, గోపీచంద్, అజయ్‌ హైదరాబాద్ బయలుదేరతారు. ఈ నలుగురు స్నేహితులు ఒక చోట రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంటారు. దీంతో వేరేరూటులో హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడతారు. ఈ ప్రయాణంలో వారు ఒక హత్యను చూస్తారు.

హత్యను చూసిన వీరిని, రౌడీ గ్యాంగ్ చంపాలనుకుంటుంది. దీంతో స్నేహితులు నలుగురు తలోదిక్కున పారిపోతారు. ప్రాణాలతో బయటపడాలనుకుంటుండగా, వారు మరో ప్రాణాన్ని కాపాడతారు. వీరు కాపాడిన వ్యక్తే సరోజ. అసలు సరోజను ఎవరు కిడ్నాప్ చేశారు... సరోజను నలుగురు స్నేహితులు ఎలా కాపాడతారు... అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ:
గోపీ పాత్రలో వైభవ్, స్వామి పాత్రలో చేరన్ చక్కగా నటించారు. ఉదయం నుంచి మరుసటిరోజు తెల్లారేదాక జరిగిన కథే ఇది. దర్శకుడు సినిమా నిడివిని తక్కువగా ఎంచుకున్నప్పటికీ, కథా గమనాన్ని బాగా తీర్చిదిద్దాడు. ప్రకాష్‌రాజ్ తన పాత్రకు న్యాయం చేశారు. విలన్ ఎవరనేది ఏమాత్రం తెలియకుండా చివరివరకు జాగ్రత్తపడ్డాడు. శ్రీహరి విలన్ అని చివర్లోనే తెలుస్తుంది.

ప్రజలకు ఏదో సేవ చేయాలని పోలీసు డిపార్ట్‌‍మెంట్‌లోకి వచ్చాను. అయితే ఇక్కడ వచ్చే జీతంతో ప్రజాసేవ చేయడం సాధ్యంకాదు. అందుకే కోటీశ్వరుడైన స్నేహితుడి కూతురిని కిడ్నాప్‌ చేయడం ద్వారా రూ.20 కోట్లు రాబట్టి ఎంతోమంది పేదలకు సేవ చేయాలనుకున్నానని విలన్ పాత్రలో కనిపించే శ్రీహరి చేత దర్శకుడు డైలాగులు చెప్పిస్తాడు.

ఈ పాయింట్ చిన్నదే అయినా, ప్రేక్షకుడికి ఒక పట్టాన అర్థం కాదు. అప్పటివరకు ఆసక్తిగా చూసిన ప్రేక్షకుడు.. ఈ డైలాగులతో గందరగోళానికి గురవతాడు. ఒక మంచి పని చేయడానికి మరొకర్ని చంపినా న్యాయమే అంటూ.. సాటి పోలీసునే ఓ సందర్భంలో శ్రీహరి తన గ్యాంగ్ చేత చంపిస్తాడు. ఈ గ్యాంగ్‌లో ఉండే వ్యక్తులు కూడా డిస్‌మిస్ అయిన పోలీసు అధికారులే కావడం కొసమెరుపు.

యువన్‌శంకర్‌రాజా సంగీతం వినసొంపుగా ఉంది. పబ్‌‌సాంగ్ మాత్రం అర్థంకాదు. కాజల్ అగర్వాల్ ఒక్క పాటకే పరిమితం అయింది. గ్యాంగ్‌ను అలరించే వ్యాంప్ పాత్రలో నిఖిత నటించింది. రోడ్డు ప్రయాణంలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తాడు. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సినిమా మొత్తం నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వైవిధ్యాన్ని ఆస్వాదించేవారుకి ఈ సినిమా నచ్చుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాలక్షేపానికైతే కాల్ సెంటర్ ఓకే
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్- రివ్యూ
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కాలక్షేపానికైతే కాల్ సెంటర్ ఓకే
సరదాగా కాలక్షేపం చేయాలనుకునే వారికైతే కాల్ సెంటర్ చిత్రం చక్కగా సరిపోతుంది.
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్- రివ్యూ
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
భవిష్యత్
తారాఫలం - ఎల్‌కే అద్వానీ.. దేశ రాజకీయాల గురించి ఏకాస్త తెలిసిన వారికైనా పరిచయం చేయాల్సిన అవసరం...
ఇంకా చదవండి|మరిన్ని...