|
| కాలక్షేపానికైతే కాల్ సెంటర్ ఓకే |
సరదాగా కాలక్షేపం చేయాలనుకునే వారికైతే కాల్ సెంటర్ చిత్రం చక్కగా సరిపోతుంది. అంతేకానీ, కథ కోసమో, చక్కటి యాక్షన్ కోసమో అయితే దాదాపు ఈ చిత్రం మీకు నచ్చకపోవచ్చు. చాలా స్పీడ్‌గా ఆలోచిస్తున్న యువత దేనినీ సీరియస్‌గా తీసుకోకపోయినప్పటికీ, కాల్ సెంటర్‌లో పని చేసే యువకుడు పాశ్చాత్య పద్ధతులకు అలవాటు పడితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా చూపించాడు.
వంశీకృష్ణ, ప్రియాంక, పూజ, విజయానంద్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అంజి కెమెరా నిర్వహణ బాధ్యతలు పోషించగా, సాయి శ్రీకాంత్ సంగీతం అందించారు. కాట్రగడ్డ లోకేష్ దత్, యార్లగడ్డ వెంకటరత్నకుమార్‌లు నిర్మించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు.
కథ గ్రామీణ ప్రాంతంలోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వంశీకృష్ణ, ప్రియాంక చిన్నప్పటి నుంచి కలసి చదువుకుంటూ సంప్రదాయ వాతావరణంలో పెరుగుతారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వారిద్దరికీ కాల్ సెంటర్ ఉద్యోగాలు లభిస్తాయి. ఆ ఉద్యోగం చేరే సమయానికి అతని కుటుంబం కష్టాల్లో ఉండగా, ఆ కష్టాలన్నిటినీ గట్టెక్కిస్తానని చెప్పి మరీ సిటీకి వచ్చిన కృష్ణ ఇక్కడి వాతావరణంతో పూర్తిగా కలుషితమవుతాడు.
అన్ని రకాల దురలవాట్లకు బానిసవుతాడు. ఇంటిని కూడా పట్టించుకోక ఇష్టానుసారం ఖర్చు పెడతాడు. ఆ సమయంలో తను పంపక పోయినా తన తండ్రి నుంచి డబ్బు అందినట్టు లేఖ రావడంతో అతను ఒక్కసారిగా నిజజీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. అయితే అప్పటికే సమయం మించిపోతుంది. తన చిన్ననాటి స్నేహితురాలు కూడా దూరం కాగా, దురలవాట్ల నుంచి అతను ఎలా బయటపడతాడనే విషయాన్ని చెప్పేలా కథ సాగుతుంది.
విశ్లేషణ కాల్ సెంటర్ చుట్టే కథ మొత్తం దాదాపుగా సాగుతుంది. అక్కడి ఉద్యోగ విధులు ఏమిటి, అక్కడి రొమాన్స్ వాతావరణం, ఆ ఉద్యోగాల్లో చేరుతున్న వారు నిజంగానే చెడిపోతారా అనే ప్రశ్నలకు కూడా ఈ చిత్రం ద్వారా సమాధానాలు దొరుకుతాయి.
చివర్లో కాల్ సెంటర్ ఉద్యోగం గురించి కోట శ్రీనివాసరావు చెప్పే వ్యాఖ్యలు అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కాల్ సెంటర్‌పై ఉన్న అపోహలనుంచి ప్రజలను బయటపెట్టేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పవచ్చు. మొదటి పాట ఫర్వాలేదని పిస్తోంది. సరదా కాలక్షేపానికి చూడొచ్చు కానీ అంతకు మించి మరో అంశం ఏమీ గొప్పగా లేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - నందమూరి తారక రామారావు వారసునిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి వచ్చిన బాలకృష్ణ... |
| |
|
|
|
|
|
|
|