యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్- రివ్యూ
Ankit, Pallavi and Friends Still
PC
తెలుగు సినిమా రంగంలో ఈ మధ్య కుటంబకథా చిత్రాలకన్నా, యూత్ చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శేఖర్‌కమ్ముల యువత ఆలోచనలను బేస్‌గా చేసుకొని రూపొందించిన ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలు ఘన విజయాలు దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. కాలేజీ రోజులే హ్యాపీడేస్ అని శేఖర్‌కమ్ముల నిరూపిస్తే... "అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్" చిత్రంలో కాలేజీ తరువాత కూడా హ్యాపీగా ఉండవచ్చని హరి ఎల్లేటి చెప్పారు.

నిఖిల్, మేఘాబర్మన్, సూర్య, ప్రదీప్, వేణు, నరేష్, సీత, సంతోష్‌పవన్, సీవీఎల్ నరహింహారావు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాతలు: కిశోర్ గంజి, రఘు, దర్శకత్వం: హరి ఎల్లేటి, సంగీతం: విసు థామస్, పాటలు: వనమాలి. ఐదుగురు వ్యక్తుల స్నేహం, జీవితం అనే కథా వస్తువులతో దర్శకుడు అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ సినిమాను తెరకెక్కించారు.

కథ:
జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ ఐదుగురు స్నేహితులు ఏం చేశారనేది ఈ సినిమా కథ. అంకిత్ (నిఖిల్), పల్లవి (మేఘాబర్మన్), రాజా (సూర్య), గోపి (ప్రదీప్), సునీల్ (వేణు) స్నేహితులు. చిన్నతనం నుంచి ఒకే కాలనీలో ఉంటూ స్నేహితులుగా ఎదుగుతారు. ఐదుగురివి విభిన్న వ్యక్తిత్వాలు. చదువు కంటే సంగీతంమీద ఎక్కువ మక్కువ చూపుతూ.. గొప్ప సంగీత దర్శకుడు కావాలని అంకిత్ కలలు కంటుంటాడు. గోపీ బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉంటాడు.

తండ్రి డబ్బులిస్తే వ్యాపారం ప్రారంభించాలనుకుంటూ.. ఏది చేయాలో తెలియక సతమతమయ్యే వ్యక్తి పాత్రను సునీల్ పోషించాడు. సంగీత దర్శకుడు కావడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతో అంకిత్ చివరకు హోటల్‌లో వెయిటర్‌ అవతారమెత్తుతాడు. ఈ విషయాన్ని ప్రేయసి పల్లవి కూడా చెప్పకుండా దాచిపెడతాడు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పల్లవి, అంకిత్‌ను నిలదీస్తుంది. నేను ఎలా ఉండాలో నీకు చెప్పాల్సిన అవసరం లేదని పల్లవితో అంకిత్ అంటాడు.

ఇలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, చేయి చేసుకునే స్థాయికి వెళుతుంది. దీంతో నీకంటూ లక్ష్యమేదీ లేదు. ప్రియురాలి కోసం కనీసం సిగరెట్ కూడా మానలేదు. నీది ప్రేమ కాదు. కేవలం ఆకర్షణ మాత్రమేనంటూ పల్లవి విడిపోతుంది. ఆ తరువాత అంకిత్ ఏం చేశాడు.. అతని జీవితం ఏమయింది.. అనుకున్న గోల్ సాధించాడా.. వీరిద్దరి ప్రేమలో మిగిలిన స్నేహితుల ప్రమేయం ఏమిటనేది కథ.

విశ్లేషణ:
నిఖిల్ తన పాత్రలో అద్భతంగా నటించాడు. చాలా హుషారుగా చేశాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. అయితే సిగరెట్, మందుకొట్టే సన్నివేశాల్లో ఒరిజినాలిటీ లోపించింది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ, మేఘాబర్మన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. స్నేహితుల్లో సునీల్ క్యారెక్టర్ హాస్యాన్ని పండిస్తుంది. కథలోనే హాస్యాన్ని మిళితం చేసి, దీనికంటూ ఒక ప్రత్యేక ట్రాక్ లేకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. సినిమాలో పాటలు కూడా ఓ మోస్తారుగా ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా హరి ఎల్లేటి తొలి ప్రయత్నం బాగానే ఉంది. ఎ సెంటర్‌లలో టాక్ బాగున్నప్పటికి.. మిగిలిన సెంటర్లలో సినిమా పరిస్థితి ప్రశ్నార్థకమే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
పోలీసు వ్యవస్థలో గూఢచారిని ప్రవేశపెట్టి, తనకు చెడు జరగకుండా చూసుకునే గ్యాంగ్‌లీడర్ కథే హోమం.
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
కొత్తదనం లోపించిన బలాదూర్
భవిష్యత్
వాస్తు - భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం నాలుగు భుజముల్లో హెచ్చుతగ్గులు ఉన్న స్థలాలను ఇంటి...
ఇంకా చదవండి|మరిన్ని...