యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
Homam Still
PC
పోలీసు వ్యవస్థలో గూఢచారిని ప్రవేశపెట్టి, తనకు చెడు జరగకుండా చూసుకునే గ్యాంగ్‌లీడర్ కథే హోమం. చెడు పరిణామాలు జరుగుతున్నప్పుడు, వాటిని దూరం చేసుకోవడం కోసం సాధారణంగా హోమం చేస్తుంటాం. తనకు జరగబోయే చెడును దూరం చేసుకునేందుకు గ్యాంగ్‌లీడర్ చేసే హోమమే ఈ సినిమా.

జేడీ చక్రవర్తి, జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, మధురిమ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్‌రావత్, సునీల్, ఎంఎస్ నారాయణ తదితరులు "హోమం" సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: జేడీ చక్రవర్తి.

కథ:
పోలీసు అవ్వాలనే లక్ష్యంతో ఉండే వ్యక్తి పాత్రను జగపతిబాబు పోషించారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. విశ్వనాథం (ప్రదీప్‌రావత్) అనే పోలీసు అధికారి మాఫియా ముఠాలోని రహస్యాలు తెలుసుకునేందుకు జగపతిబాబుని కోవర్టుగా నియమిస్తాడు.

హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ, సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒక ముఠా నాయకుడు డాడీ (మహేష్ మంజ్రేకర్)ని విశ్వనాథం అరెస్టు చేయలేకపోతాడు. తన చీకటి సామ్రాజ్యానికి అడ్డులేకుండా చేసుకోవడానికి డాడీ కూడా ఒక వ్యక్తిని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో నియమిస్తాడు. ఈ పాత్ర పేరు చందు (జేడీ చక్రవర్తి).

డాడీ, విశ్వనాథ్‌లు ఒకరికితెలియకుండా ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధించారు.. ఒకరినొకరు పట్టుకోగలిగారా.. అరాచకాలకు అడ్డుకట్ట పడిందా.. అన్నదే మిగిలిన సినిమా.

విశ్లేషణ:
ఈ సినిమా చూస్తున్నంతసేపు హాలీవుడ్ చిత్రం తరహాలో ఉంటుంది. "ది డిపార్టెట్" అనే సినిమా స్ఫురిస్తుంది. కథాంశం ఆసక్తికరం ఉండటం ప్లస్ పాయింట్. అయితే హోమంలోని కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాలతో ప్రభావితం అయినట్టు కనిపిస్తాయి. గూఢచారుల పాత్రల్లో జగపతిబాబు, జేడీ చక్రవర్తి నటన ఒక మోస్తారుగా ఉంది. క్లైమాక్స్ మాత్రం రక్తికట్టిస్తుంది.

హీరోయిన్లు మమతా మోహన్‌దాస్, మధురిమ పాత్రలకు ప్రాధాన్యత లేదు. హీరోల పక్కన కాలక్షేపానికి పెట్టినట్టు కనిపిస్తుంది. విలన్ పాత్రలో మహేష్ మంజ్రేకర్ చక్కని నటనను ప్రదర్శించారు. ప్రదీప్ రావత్ ఈ సినిమాలో నిజాయితీ ఆఫీసర్‌గా భిన్నమైన పాత్రలో కనిపించారు. ఎంఎస్ నారాయణ హాస్యం అంతంతమాత్రమే.

సాంకేతికపరంగా సినిమా పరవాలేదనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ మోస్తారుగా ఉండగా, పాటలు ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో సంగీతానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. భరణి కె. ధరణ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హాలీవుడ్ సినిమాలు చూడనివారికి ఈ సినిమా నచ్చుతుందోమేగానీ, సగటు ప్రేక్షకుడిని ఎంత వరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...