|
| పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు |
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై కె.రామకృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ఆదివిష్ణు. ఈ చిత్రంలో సుమన్, సునీల్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకత్వం వహించారు. సమాజాన్ని పీడిస్తున్న తీవ్రవాదాన్ని ఓ వ్యక్తి ఎలా అరికట్టాడన్న పాయింట్‌తో రూపొందిన చిత్రం ఆదివిష్ణు.
కథ: రిటైర్డ్ ఉపాధ్యాయుడయిన కోటశ్రీనివాసరావు కొడుకు దాసరిఅరుణ్‌కుమార్ (ఆదివిష్ణు). అరుణ్‌కుమార్ కనిపెట్టిన ఓ యాంటీ వైరస్‌ను మెచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ అతనికి అమెరికాలో ఆఫర్ ఇస్తుంది. అమెరికా వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం అరుణ్‌కుమార్ మంత్రి సుమన్‌ను ఆశ్రయిస్తాడు. రాజకీయ గురువు బాలయ్యను మోసం చేసి మంత్రి అవుతాడు సుమన్. సుమన్ చేసే చెడ్డ పనులకు ప్రదీప్‌రావత్, ఐశ్వర్యలు అండగా ఉంటారు.
సుమన్ ఓ దశలో గురువును హత్య చేస్తాడు. ఈ హత్యను అక్కడే ఉన్న స్నేహ (అంజలి) ఫోన్‌లో చిత్రిస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రదీప్‌రావత్ గ్యాంగ్ స్నేహను చంపేందుకు వెంటాడుతుంటుంది. ఊహించని సంఘటనలో స్నేహ హీరో అరుణ్‌కుమార్ సాయం కోరుతుంది. దీంతో అరుణ్‌కుమార్ రౌడీలను చితకబాదుతాడు. వారు హీరోపై పగ పెంచుకుంటారు.
మరోవైపు అమెరికా వెళ్లే రోజు దగ్గరపడగా, నగరంలో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవిస్తాయి. స్థానికులు చూపించిన ఊహాచిత్రమంటూ పోలీసులు అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేస్తారు. ఈలోగా ఢిల్లీ నుంచి సి.బి.ఐ అధికారిణిగా ప్రేమ వచ్చి సమస్యకు పరిష్కారం కనుక్కుంటుంది. ఆమె కనుగొన్న పరిష్కారం ఏంటి? అరుణ్‌కుమార్ ఏమవుతాడు? అసలు తీవ్రవాది ఎవరు అనే అంశాలను తెరపై చూడాలి.
విశ్లేషణ: చిత్రంలో అనుకోని ట్విస్ట్‌లు చాలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో అరుణ్‌కుమార్ అమరినా, హావభావాలను మెరుగుపరుచుకోవలసి ఉంది. స్నేహ పాత్ర ఫర్వాలేదనిపించింది. హాస్యపరంగా అలీ, వేణుమాధవ్, సునీల్, ధర్మవరపులు నవ్వులు పండించారు. ఎ.సి.పి. చేసిన ద్రోహంతో తన జీవితం నాశనమైందంటూ కోర్టులో హీరో అడిగే ప్రశ్నలు ఆకట్టుకుంటాయి. రోటీన్ కథే అయినా కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరించేవారు. మొత్తం మీద పాత, కొత్త కథలతో ఉన్న ఈ చిత్రం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|