యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
కొత్తదనం లోపించిన బలాదూర్
Balaadoor
PC
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్. ఈ చిత్రంలో రవితేజ, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ:
ఉమ్మడి కుటుంబంలో ఉండే రవితేజ (చంటి) బాధ్యతలు లేకుండా గాలికి తిరుగుతుంటాడు. తండ్రి చంద్రమోహన్ (పురుషోత్తం) మీద కంటే పెద్దనాన్న కృష్ణ (రామకృష్ణ)పై రవితేజకి గౌరవం, అభిమానం అధికంగా ఉంటాయి. రవితేజను ఎప్పుడూ పెద్దనాన్న వెనకేసుకువస్తుంటాడు. ఇలా ఉండగా, వీళ్లింటికి అనుష్క (భానుమతి) చదువుకోవడానికి వచ్చి రవితేజతో ప్రేమలో పడుతుంది. ఓ సందర్భంలో కృష్ణ కుమార్తె వివాహం రవితేజ వలన చెడిపోతుంది. దీనితో ఆవేశపరుడైన తండ్రి చంద్రమోహన్ రవితేజను ఇంటి నుంచి గెంటేస్తాడు.

రవితేజ ఇంటిలో నుంచి బయటకు వచ్చిన సమయంలో తండ్రి మృతి చెందడం, పెద్దనాన్న పరువు పోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. వీటిని రవితేజ బయట ఉండే పరిష్కరిస్తాడు. ఈ సమయంలో కుటుంబ పెద్ద కృష్ణకు, గతంలో ఆయన వద్ద పనిచేసి చెడ్డవాడిగా మారిన ప్రదీప్ రావత్‌కు మధ్య పగ, ప్రతీకారం నెలకొంటాయి. చివరకి ఏమి జరుగుతుంది? రవితేజ ఏ విధంగా సమస్యలను పరిష్కరిస్తాడన్నది చిత్రం.

విశ్లేషణ:
రోటీన్ చిత్రాల తరహాలోనే పాటలు, ఫైట్లు మినహా కొత్తదనమేమీ కనిపించదు. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితియార్థంలో బాదుడు ఎక్కువగా ఉంటుంది. హీరోకి లవ్ ట్రాక్ ఉండాలి కనుక హీరోయిన్‌ను పాత్రను పెట్టినట్లుంది. ఇద్దరూ కలిస్తే పాటలు వస్తుంటాయి.అదే విలన్లు కనిపిస్తే ఫైట్లు ఉంటాయి. చిక్కుముడులు పెద్దగా లేకపోయినా కథ, కథనం ఆశించిన స్థాయిలో లేవు. బ్రహ్మానందం పాత్ర పరంగా హాస్యాన్ని పండించాడు. రిపేరైన బండీని సెంటిమెంట్‌తో కొబ్బరికాయ కొట్టి డెలివరీ చేస్తుండడం నవ్వు తెప్పిస్తుంది. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన సునీల్ అందరినీ నవ్విస్తాడు. మొత్తంమీద పలు సక్సెస్ చిత్రాలను తీసిన దర్శకుడు ఈ చిత్రంతో ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి మరి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...