యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
Ullasamga utsahanga
Pc
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, బ్రహ్మానందం, ధర్మంపు, సునీల్, సుధ, సుభాషిణి తదితరులు నటించారు. చిన్నతనంలో స్నేహితులు ఉన్న హీరోహీరోయిన్లు, తరువాత విడిపోయి పెద్దయ్యాక ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ఇది.

కథ:
ఓ పల్లెటూరిలో బాలాజీ (యశోసాగర్), ధనలక్ష్మి (స్నేహా ఉల్లాల్) స్నేహితులుగా ఉంటారు. ధనలక్ష్మి సంతోషం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే మనస్తత్వం బాలాజీది. ఓ సందర్భంలో తన తండ్రితో పాటు బాలాజీ ఊరు విడిచి వెళ్లిపోతాడు. వాళ్లు పెరిగి పెద్ద వాళ్లవుతారు. అయినప్పటికీ, ధనలక్ష్మి మనసులో బాలాజీ అలానే ఉంటాడు. ఆమె తల్లికి బాలాజీ అంటే నచ్చదు. గాలికి తిరిగే వాడని అసహ్యించుకుంటుంది.

ఈ నేపథ్యంలో ఓ సారి సెలవులకు ధనలక్ష్మి తన బంధువుల ఇంటికి వెళుతుంది. అక్కడ ఓ వ్యక్తి పరిచయమవుతాడు. అతను ధనలక్ష్మిని గాఢంగా ప్రేమిస్తాడు. తన చిన్ననాటి కథ చెప్పి బాలాజీని ప్రేమిస్తున్నట్టు చెబుతుంది ధనలక్ష్మి. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే. ధనలక్ష్మి ప్రేమించిన వ్యక్తి ఎవరు? అయితే బాలాజీ ఏమయ్యాడు? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:
నటనపరంగా యశోసాగర్ డెవలప్ కావాల్సి ఉంది. ఎమోషనల్ సన్నివేశాలలో హావభావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోయాడు. సునీల్, ధర్మవరపు, వేణుమాధవ్‌లు హాస్యాన్ని బాగా పండించారు. తొలిప్రేమ, నమస్తే లండన్ చిత్రాలను తలపించేలా ఈ చిత్రం ఉంది. ఫొటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంటాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
రామ్ మరో హంగామా రెడీ
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించిన కేరళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్.
ఇంకా చదవండి|మరిన్ని...