యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
చక్కని వినోదంతో హరేరామ్
Kalyan Ram
PC
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేసే వైద్యమాఫియాపై కవలలు హరి, రామ్‌లు చేసిన పోరాటమే ఈ చిత్రం.

కథ:
తలలు అతుక్కుని పుట్టిన చంద్రమోహన్, సీతల కవల పిల్లలను వేరు చేసే ఆపరేషన్ సక్సెస్ సాధిస్తాడు డాక్టర్ నాయుడు (రంగనాథ్). అయితే రామ్‌లో చిన్న మెదడు తగినంతగా ఎదగక మైండ్ ఆంబ్లీగేటా అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఎవరికైనా తెలివితేటలు ఉంటే చూసి సహించలేడు. అలా ఉన్న తన అన్నను చంపే ప్రయత్నం చేస్తాడు. దీనితో తల్లి సీత రామ్‌ను తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది. కాగా, హరికృష్ణ (కల్యాణ్‌రామ్) తండ్రి వద్ద పెరిగి ఐపీఎస్ అధికారి అవుతాడు.

ఉత్తమ జర్నలిస్టు అవార్డు తీసుకోబేయే రిపోర్టర్ హత్యకు గురవుతాడు. దీనిని హరి డీల్ చేస్తాడు. అనంతరం ఉత్తమ డాక్టర్ అవార్డు తీసుకోబోయే రాజీవ్‌కనకాల కూడా హత్యకు గురవుతాడు. ఈ హత్యకు హరియే కారణమని తలచి లోన్ రికవరీ అధికారిగా ఉన్న ప్రియమణి సీబీఐ అని చెప్పి అరెస్టు చేయిస్తుంది. ఇక రెండో భాగంలో వీరిని చంపింది హరి కాదు రామ్‌ అని వైద్యశాఖామంత్రి కనిపెడతాడు. ఇదిలా ఉండగా టీవీ రిపోర్టర్‌ను చంపింది రామ్ అని తెలిసి అతని చంపాలని అధినేత అశోక్ కుమార్ భావిస్తాడు. మరో రిపోర్టర్ పాత్రలో కనిపిస్తుంది సింధుతులానీ.

ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేసే వైద్యమంత్రి గుట్టు తెలియడంతో ఆమెను వైద్యమంత్రి మనుషులు చంపేస్తారు. అప్పటికే, సింధును ప్రేమించిన రామ్ తర్వాత ఏమి చేస్తాడు? హరిని ఎందుకుచంపాలని భావించారు? టీవీ అధినేతకు, మంత్రికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాలు సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రంలో చెప్పలేనన్ని మెలికలు ఉంటాయి.

విశ్లేషణ:
హరేరామ్ చిత్రంలో ఉన్న మెలికలను విప్పే క్రమంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కల్యాణ్‌రామ్ మునుపటి పాత్రలతో పోల్చితే ఈ పాత్రకు న్యాయం చేశాడు. లంచగొండి పాత్రకు కోటశ్రీనివాసరావు చక్కగా సరిపోయారు. వింతరోగాల పేరుతో ప్రజలను మంత్రులు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ చిత్రంలో దర్శకుడు చూపించాడు. హాస్యం విషయంలో బ్రహ్మానందం పాత్ర బావుంది. అలీ, వేణుమాధవ్, రఘుబాబు పాత్రలు ఉన్నా అంతగా హాస్యం పండలేదు. పతాక కార్యక్రమంలో మంత్రిని చంపే సన్నివేశం బావుంది. రోటీన్ చిత్రాలకు భిన్నంగా కల్యాణ్‌రామ్ చేసిన ఈ చిత్రం అభినందనీయం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
రామ్ మరో హంగామా రెడీ
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
సామాన్యుడి తిరుగుబాటే అధ్యక్షా..!
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...