యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
శనివారం, 28 జూన్ 2008   ( 16:32 IST )
Nithin
PC
యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్న పాయింట్‌పై విక్టరీ చిత్రం రూపొందింది. నితిన్, మమతామోహన్‌దాస్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి రవి సి కుమార్ దర్శకత్వం వహించారు. వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం చక్రి కెమేరా విజయ్ సి. కుమార్.

కథ:
దేవరాజ్ (అశుతోష్‌రాణా) ఒకరి భూమిని కబ్జా చేస్తాడు. మరోవైపు మరో గూండా పాండు (సుప్రీత్) మరొకతని లాండ్‌ను బెదిరించి తక్కువ మొత్తంతో లాక్కుంటాడు. ఆ వ్యక్తి దేవరాజ్‌ను ఆశ్రయిస్తాడు. తనపై ఎదురుతిరిగిన పాండు చేయి నరికి ఆ భూమిని తన పేరున మార్చుకుంటాడు దేవరాజ్.

కట్ చేస్తే విజయ్ (నితిన్) కండబలం ఉన్న బుద్ధిశాలి. ఐఏఎస్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుంటాడు. అతనికి తండ్రి తణికెళ్లభరణి, సోదరి ఉంటారు. తన కొడుక్కి పెళ్లి చేయాలనే ఉద్ధేశ్యంతో కంప్యూటర్‌లో పెళ్లి సంబంధాలు చూస్తూ కుజదోషం ఉన్న అమ్మాయి కోసం వేతుకుతుంటాడు.

సరిగ్గా అలాంటి వ్యక్తి కోసమే ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగిణిగా జానకి (మమతామోహన్‌దాస్) పనిచేస్తుంటుంది. విజయ్ బయోడేటా తెలుసుకుని అతనికి తెలీకుండా జానకి ఆటపట్టిస్తుంది. దీనికి అతని స్నేహితుడు శశాంక్ ఓ షాప్ పెట్టేందుకు లోన్ ఆఫీసరుగా వచ్చినప్పుడు విజయ్‌ను కలుసుకుంటుంది.

మరోవైపు శశాంక్ టీవీ యాంకర్ సింధు (సింధు తులానీ)ని ప్రేమిస్తుంటారు. ఇలా ఉండగా, అక్కడే ఓ కాలనీలో ఐదెకరాల్లో తనకున్న స్థలంలో ఇల్లుకట్టుకోవాలని తణికెళ్లభరణి కలలు కంటుంటాడు. అది స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఇల్లులేని అభాగ్యులైన కొంత మందికి ఉచితంగా ఇచ్చింది.

దాన్ని కబ్జా చేయాలని దేవరాజ్ చూస్తాడు. దీనికోసం పోలీసులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను లోబరుచుకుంటాడు దేవరాజ్. ఆ విధంగా ఆ స్థలాన్ని దేవరాజ్ తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. అంతా నిరాశ్రయులవుతారు. కోర్టుకి వెళ్లినా న్యాయం జరుగదు. దీంతో విజయ్ తన మైండ్ గేమ్‌తో దేవరాజ్ బండారం బయటపెట్టి ప్రజల అభిమానాలను చూరగొంటాడు. ఇందులో స్నేహితుల పాత్ర ఏమిటి..? వారంతా ఎలా ఒక్కటి కాగలిగారు..? ఏం జరిగింది...? అన్న విషయాన్ని చిత్రంలో చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ:
పాటలు మినహా మిగిలిన చిత్రాన్ని దర్శకుడు బాగా తెరకెక్కించాడు. నితిన్ సిక్స్ ప్యాక్ బాడీతో అందంగా కనపడేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతెన్నులపై ఎంఎస్ నారాయణ ఎక్కుపెట్టిన సంభాషణలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే యాక్షన్ సన్నివేశాలు బాగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో దేవరాజ్ చేత నిజం చెప్పించే తీరు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుంది. భూకబ్జాలు, దందాలు ఈ చిత్రంలో మన కళ్ల ముందు జరిగిన కొన్ని నిజాలను గుర్తుకు తెప్పించేవిధంగా ఉంటాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్ మరో హంగామా రెడీ
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
సామాన్యుడి తిరుగుబాటే అధ్యక్షా..!
మెప్పించే పాండురంగడు
ప్రేయసి కోసం బుజ్జిగాడు శోధన
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రామ్ మరో హంగామా రెడీ
ఎంత కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు అయినా ప్రేమ, ఆప్యాయతలతో ఒక్కటి చేయవచ్చనే...
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
మెప్పించే పాండురంగడు
భవిష్యత్
తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్...
ఇంకా చదవండి|మరిన్ని...