|
| రామ్ మరో హంగామా రెడీ | |
ఎంత కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు అయినా ప్రేమ, ఆప్యాయతలతో ఒక్కటి చేయవచ్చనే పాయింట్‌పై రూపొందిన చిత్రమే రెడీ. స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ చిత్రంలో రామ్, జెనీలియా హీరోహీరోయిన్‌లుగా నటించారు. ఇంకా కోటశ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, సునీల్, శ్రీనివాస్‌రెడ్డి, షఫి, చంద్రమోహన్, పృధ్వీ తదితరుల నటించారు.
కథ: చందు(రామ్) కాలేజీ విద్యార్ధి. ఉమ్మడి కుటుంబం. తన మేనకోడలతో (తమన్నా) పెళ్లి కుదిర్చి ఆర్భాటంగా ఏర్పాట్లను చేస్తారు కుటుంబ సభ్యులు. అయితే తమన్నా వేరొకరిని ప్రేమించిందని తెలుసుకుని ఆమెను పెళ్లి నుంచి తప్పించి అందరికీ షాక్ ఇస్తాడు చందు. దీంతో తన వారి కోపానికి గురై స్నేహితుల దగ్గరే ఉండిపోతాడు. ఈలోగా మరో స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని కళ్యాణమండపం నుంచి పూజ (జెనీలియా)ను చందు తీసుకువస్తాడు.
కానీ గుడిలో తన స్నేహితుడు వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటుండం చూసి అతన్ని నిలదీయగా.. తను తీసుకువచ్చింది వేరే అమ్మాయినని చందు గ్రహిస్తాడు. ఇక అక్కడ నుంచి పూజ తనను కర్నూల్లోని స్నేహితురాలింటికి తీసుకెళ్లమంటుంది. ఇంతలోపూజ తరపు వారు ఫ్యాక్షనిస్టులు కావడంతో వెంబడిస్తారు. అలా చందు బృందం అడవిగుండా తప్పించుకుని కర్నూలు చేరుతారు.
తీరా అక్కడికి చేరుకున్నాక పూజ స్నేహితురాలు ఉండదు. ఏంచేయాలి అనుకుంటుండగా, తను అమెరికా నుంచి వచ్చానని పాస్‌పోర్ట్ పోవడం వల్లే ఓ పదిరోజుల పాటు స్నేహితురాలు వద్ద ఉందామనుకున్నట్లు చందూకు వివరిస్తుంది పూజ. అది విన్న చందు.. తన తెలివితేటలను ఉపయోగించి పూజను తన ఇంటిలోనే ఉండేలా చేస్తాడు. చందు కుటుంబంలోని ఆప్యాయతలను చూసి పూజ వీరితో కలిసిపోవాలనుకుంటుంది.
చివరిక చందు, పూజల మధ్య విషయం ఉందని తెలిసి పెళ్లి చేయాలనుకుని వారి కుటుంబపూజారి దగ్గరకు వెళతారు చందు కుటుంబసభ్యులు. మధ్యలో దేవాలయంలో ఆగి అందరూ పవిత్రస్నానాలకు ఉపక్రమించే సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన పూజ మేనమామ (కోటశ్రీనివాసరావు) పూజను చూసి తీసుకెళతాడు.
విషయం తెలీని చందు కుటంబసభ్యులు అదొక చోద్యంలా తిలకిస్తుండగా.. చందు జరిగిన విషయాన్ని వారికి వివరిస్తాడు. విషయం తెలుసుకున్న చందు కుటుంబసభ్యులు వారిద్దరికీ వివాహం చేస్తారు. అయితే ఆ వివాహం ఎలా జరిగింది...? వచ్చిన అవాంతరాలను ఎలా పరిష్కరించారు...? మెక్‌డొనాల్డ్ మూర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏంటి...? అన్నది సినిమా చూడక తప్పదు.
విశ్లేషణ: దేవదాసు చిత్రంలో నటించిన రామ్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో.. ఇందులోను అలాగే కనిపించి కథలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయ్యాడు. పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. దేవిశ్రీ సంగీతం వల్ల రామ్ డ్యాన్స్‌కు అందం వచ్చిందా.. లేక రామ్ డ్యాన్స్‌తో సంగీతానికి అందం వచ్చిందా అన్నట్లుంటుంది రామ్ డ్యాన్స్. ఇక పూజ పాత్ర పర్‌ఫెక్ట్. కోటశ్రీనివాసరావు, చంద్రమోహన్‌ల నటన ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అలాగే చాలా కాలం తర్వాత స్రవంతీ మూవీస్ బేనరుపై వచ్చిన ఈ చిత్రం ఓ బిగ్ హిట్‌తో ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. కథ పాతదే అయినా.. కథనంలో కొత్తదనాన్ని చూపించాడు శ్రీనువైట్ల. ఇవంతా ఒకెత్తయితే ఊరవతల రావిచెట్టులా నీడనివ్వాలనుకునే శ్రీనువైట్ల ఢీ, రెడీ చిత్రాల ద్వారా మైండ్ గేమ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|