యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
Dasavataram
PC
ఓ శాస్త్రవేత్త కోట్ల మంది ప్రాణాలను ఎలా కాపాడాడు...? అన్నదే దశావతారం. వైవిధ్య నటుడు కమల్‌హాసన్, అసిన్, జయప్రద, నెపోలియన్, మల్లికాషెరావత్ తదితరులు నటించారు. కథ, స్క్రీన్‌ప్లే- కమల్‌హాసన్, నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్, దర్శకత్వం కేఎస్ రవికుమార్, సంగీతం హిమేష్ రేష్మియా.

కథ:
12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణవులకు వైరం జరిగే రోజులు. శైవమత దురభిమానంతో చోళరాజు రెండవ కుళోత్తుంగుడు (నెపోలియన్) వైష్ణవుడనే వాడని లేకుండా చేయాలని చూస్తాడు. ఇందులో భాగంగా వైష్ణవుల ఆరాధ్యదైవమైన గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెకలించగా.. దాన్నిఎదిరించిన రంగరాజ నంబి (కమల్)ని విగ్రహానికి కట్టి సముద్రంలో కలిపేస్తాడు.

కట్‌చేస్తే కథ 2004లో అమెరికాలో సైంటిస్ట్‌గా గోవింద్ (కమల్) పనిచేస్తుంటాడు. అతని బృందం కనిపెట్టిన జీవాయుధం ఎంత ప్రమాదకరమైనదో ప్రయోగశాలలో కోతి ద్వారా తెలుసుకుంటాడు. పరివర్తనం చెందిన గోవింద్ దాన్ని నాశనం చేయాలని కోరినప్పటికీ సీనియర్ సైంటిస్టులు అంగీకరించగపోగా, కోట్ల డాలర్లకు అమ్మాలనుకుంటారు. ఇది తెలుసుకున్న గోవింద్ ఆ రసాయనాన్ని చేజిక్కించుకుని ఎఫ్‌బీఐకి అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తాడు.

ఇక్కడ నుంచి యాక్షన్ సన్నివేశాలు ప్రారంభమవుతాయి. అనుకోని సంఘటనతో ఆ రసాయనం విమానంలో ఇండియాకు వస్తుంది. గోవింద్ ఇండియా చేరుకుని ఈ రసాయనం చేరిన అడ్రసుకు వెళతాడు. సీఐఏ మాజీ ఏజెంట్ ఫ్లెచర్ (కమల్) తన ప్రియురాలు మల్లికా షెరావత్‌తో కలిసి గోవింద్‌ను వెంటాడుతూ వస్తారు.

ఆ రసాయనం ఓ వృద్ధురాలైన కృష్ణవేణి (కమల్)కి కొరియర్ ద్వారా చేరిన తర్వాత ఆమె దానిని గోవిందరాజస్వామి విగ్రహంలో వేసేస్తుంది. అక్కడ కూడా అనుకోకుండా పోలీసులు రావడంతో ఆ విగ్రహాన్ని తీసుకుని గోవింద్ పరుగులు తీస్తుండగా.. భక్తురాలైన రాధ విగ్రహం కోసం (అసిన్) గోవింద్‌ని వెంటాడుతుంది. ఇలా నడుస్తున్న కథ చివరికి ఏమైంది...? ఫ్లెచర్ ఏం చేశాడు...? మిగిలిన కమల్ పాత్రల తీరుతెన్నులేంటి..? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ చిత్రంలో దశావతారాలను కమల్‌హాసన చక్కగా పండించాడు. పోలీసు అధికారిగా అందరినీ నవ్విస్తాడు. హీరోగా.. విలన్‌గా కమల్ నటన ఈ చిత్రానికి హైలెట్‌. ఫ్లెచర్ పాత్రలో కమల్ ఉన్న సంగతి కొంత కథ నడిచే వరకు కూడా గుర్తుపట్టలేనట్లుగా ఉంటుంది. నెపోలియన్ చోళ రాజు పాత్రలో చక్కగా సరిపోయాడు.

చిత్రంలో అక్కడక్కడ లింకులు పూర్తిగా అమరకున్నా... క్లైమాక్స్‌లో ఫ్లెచర్, షింఘేన్ (కమల్) పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అలాగే సునామీ భీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చక్కగా తెరకెక్కించారు. మొత్తంపై చెప్పాలంటే ... కమల్ ఈ చిత్రంతో మానవ వినాశనానికి పూనుకోవద్దనే సందేశాన్నిచ్చాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సామాన్యుడి తిరుగుబాటే అధ్యక్షా..!
మెప్పించే పాండురంగడు
ప్రేయసి కోసం బుజ్జిగాడు శోధన
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
అక్టోబర్‌లో హిందీ గజిని
దక్షిణాదిన మంచి హిట్ కొట్టిన గజిని చిత్రం హిందీలోను రూపొందుతున్న విషయం విదితమే.
రీరికార్డింగ్‌లో బ్లాక్ అండ్ వైట్
మావోయిస్టులపై చిత్రం
భవిష్యత్
తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్...
ఇంకా చదవండి|మరిన్ని...