|
| సామాన్యుడి తిరుగుబాటే అధ్యక్షా..! |
సామాన్యుడు ఆగ్రహిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నది అధ్యక్షా...! అందరికీ వందనాలు చిత్ర కథ. భవిష్య ఆర్ట్ బేనరుపై వలవలి జగన్నాథరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మారుధూరి రాజా అందించారు. సాయికార్తీక్ స్వరకల్పన చేయగా, రవిరాజా పాటలను సమకూర్చారు. విజయ్‌చందర్, రఘుబాబు, జీవా, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
కథ: పాఠాలు చెప్పే మాస్టారు (విజయ్‌చందర్)కు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు సూర్య లెక్చరర్, చిన్నవాడు ఓ ప్రైవేటు ఉద్యోగి. మాస్టారుగా పదవీబాధ్యతల నుంచి రిటైరయ్యాక పిల్లలతో గడపటానికి తనకున్న స్థలంలో ఇల్లు కడతాడు విజయ్‌చందర్.
తీరా గృహప్రవేశం రోజు ఆ ఊరిలో ఉన్న గూండాలు తమ స్థలంలో కట్టారని కబ్జా చేస్తారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాలు తిరిగినా న్యాయం జరక్కపోగా.. జైలు పాలవుతాడు. ఎట్టకేలకు పొరిగింటి వ్యక్తి జామీను మీద బయటకు వచ్చినా గూండాల నుంచి వేధింపులు వెంటాడుతుంటాయి.
వారిని ఎదిరించినందుకు విజయ్‌చందర్ కన్నకొడుకు కత్తిపోట్లకు గురవుతాడు. కూతురు గూండాల చేతిలో చెరచబడుతుంది. ఆమెను ప్రేమించిన వ్యక్తి హత్యకు గురవుతాడు. ఇన్ని ఘోరాలను చూడలేక ఆఖరికి గూండాలతో మాస్టారు రాజీకొచ్చి వారిచ్చిన రూ.15లక్షలతో ఇళ్లు ఖాళీ చేస్తాడు. ఆ తర్వాత విజయ్‌చందర్ ఏం చేశాడు...? రఘుబాబు, జీవా, బ్రహ్మాజీ పాత్రల నేపధ్యమేమిటి.. చివరికి మాస్టారు ఏం సాధించారు..? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ: రచయితే దర్శకుడిగా అయితే తననుకున్నది ఎలా మలచుకోవచ్చో మరుధూరి రాజా ఈ చిత్రం ద్వారా చేసి చూపించాడు. మరుధూరి తన పదునైన బాణాలతో నేటి సమాజంలోని పరిస్థితిని గుర్తుకు చేస్తాడు. ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చినా.. దేనికదే ప్రత్యేకత అన్నట్లు ఈ చిత్రం ప్రత్యేకత చూస్తే కానీ తెలీదు.
రోజువారీ పేపర్లో, ప్రస్తుతం జరుగుతున్న భూకబ్జాల వల్ల సామాన్యుడు ఎటువంటి బాధలకు గురయ్యాడు.. ఇందులో రాజకీయ నేతలకు, రౌడీలకు ఎలాంటి ప్రమేయం ఉంటుందన్న విషయాన్ని చక్కగా తెరకెక్కించారు. కథ జరుగుతున్నంత సేపు చిత్రంలో లీనమవ్వడం ఈ చిత్రంలో మరో ప్రత్యేకత.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చిత్రం అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకలనే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|