|
| మెప్పించే పాండురంగడు |
రసహృదయుడు, భక్తిపారవశ్యుడుగా మారితే ఎలా ఉంటుంది అనేదే కథ. నందమూరి బాలకృష్ణ, స్నేహ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో కె.విశ్వనాథ్, టబు, సునీల్, గుండు హనుమంతరావు తదితరులు నటించారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె. కృష్ణమోహనరావు నిర్మించారు. ఎంఎంకీరవాణి స్వరకల్పన చేశారు.
కథ: ఎన్టీఆర్ నటించిన అలనాటి పాండురంగ మహత్యం కథే ఈ పాండురంగడు చిత్రం అన్న విషయం తెలిసిందే. పుండరీపురం అనే ఊరిలో పెద్దాయన (కె.విశ్వనాథ్) కృష్ణుని భక్తుడు. అష్టమినాడే పుట్టిన తన బిడ్డకు రంగనాథుడు అనే పేరు పెడతాడు. ముద్దుగా రంగడు అనిపిలుచుకుంటాడు.
కృష్ణుడు చేసినట్లే చిన్నతనంలో చిలిపిపనులు చేస్తుంటాడు రంగడు. ఇదేమని మందలిస్తే కృష్ణడు చేస్తే లీల, నేను చేస్తే గోల అని ప్రశ్నిస్తాడు. పదహారు వేల మంది గోపికలతో కృష్ణుడు బాటలో తాను నడిచి ఆయన్నే అధికమిస్తాననే తత్త్వం అతనిది. పెళ్లి చేసుకోమని అడిగినందుకే ఊరువిడిచి వెళ్లిపోతాడు.
ఎలాగైనా తన బిడ్డ తిరిగి రావాలని విశ్వనాథ్ తన ఇంటిలో యజ్ఞం చేయిస్తాడు. అనుకున్నట్లు పాండురంగడు రావడం, మళ్లీ పెళ్లి ప్రస్తావన వస్తే వెళ్లిపోతాననడం జరుగుతుంది. అలా వచ్చినవాడు తన ఊరిలోని ఆడవాళ్లందరినీ గోపికలుగా భవించి వారితో చనువుగా ఉంటాడు.
ఇది తట్టుకోలేని వారి తల్లిదండ్రులు విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేయడం.. ఎలాగైనా పెళ్లి చేయాలని చూడ్డం జరుగుతుంది. ఇదిలా ఉండగా పక్కగ్రామానికి అమృత (టబు) అనే రంగసాని వస్తుంది. ఆమె రంగడ్ని చూసి మోహించడంతో ఇద్దరూ దగ్గరవుతారు. మరోవైపు మరో గ్రామంలో గుడిలో దొరికిన ఆడశిశువును పెంచి పెద్దచేస్తాడు పూజారి బాలయ్య.
వయస్సుతో పాటు శ్రీకృష్ణునిపై భక్తి కూడా పెరుగుతుంది. ఓ రోజు రాత్రి కలలో ఆమెకు కృష్ణుడు కనిపించి పక్క ఊరిలోని రంగనాథుడికి భార్యవి కమ్మని చెప్పడంతో ఆమె తండ్రి బాలయ్య పక్కఊరికి వెళ్లి తన కుమార్తెను కోడలిగా చేసుకోవాలని విశ్వనాథ్‌ను కోరుతాడు.
రంగనాధుడికీవిషయం తెలిసి కుదరదంటాడు. అయినప్పటికీ లక్ష్మీ (స్నేహ) పట్టువదలక రంగనాథుని ఇంటి ఎదురుగా కృష్ణుణ్ణి కొలుస్తూ ఉంటుంది. రంగనాధుడిలో మార్పు రాకపోగా రెండు రాత్రులు గడుపుతానని అవహేళన చేస్తాడు. ఇదంతా వైకుంఠం నుంచి గమనిస్తున్న శ్రీకృష్ణుడుతో అష్టభార్యలు రంగనాధుని మార్గంలో పెట్టాల్సిందిగా కోరుతారు.
దీంతో స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు భువికి దిగివచ్చి రంగసాని వేషధారణతో రంగనాధుని ఇంటివాడ్ని చేస్తాడు. తొలి రాత్రిని చెడగొట్టాలనే ఉద్దేశ్యంతో అమృతతల్లి పరిచారికను పంపి ఈ రోజు అమృత పుట్టిన రోజని, రంగనాధున్ని తీసుకురమ్మనగా, రంగనాధుడు వస్తానని మాటిస్తాడు. అలాగే లక్ష్మీతోను గడుపుతానని చెబుతాడు. ఆ తర్వాత ఏం చేశాడు...? ఎలాంటి పరిణామాలు సంభవించాయి..? తన తల్లిదండ్రులను ఏమి చేశాడన్నది..? కథ.
విశ్లేషణ: సాధారణంగానే రంగనాధుడు స్త్రీలోలుడు కనుక ఫస్ట్‌హాఫ్‌లో శృంగారరసాన్ని సన్నివేశాలతో నింపేశారు. అయితే యువతను బాగా ఆకట్టుకుంటుంది. శ్రీకృష్ణుడు, నారదుడు నుంచి భూలోకంలోని సన్నివేశాలు పట్టుసడలకుండా దర్శకుడు చాకచక్యం చూపారు. క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడికి, రంగనాధుడికి మధ్య జరిగే సన్నివేశం భక్తిలో ముంచెత్తుతుంది.
రంగనాధునిగా బాలకృష్ణ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. మాతాపిత సేవే మాధవ సేవే అంటూ ఆశ్రమంలో తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్న సన్నివేశంలో మోహన్‌బాబు కనబడతాడు. అనూహ్యంగా ఆశ్రమానికి వచ్చిన రంగనాధునికి, మోహన్‌బాబుకు మధ్య జరిగిన సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. గతంలో తీసిన ఈ చిత్రంలో నటించిన అంజలీదేవీ పాత్రలో స్నేహ నటించి మెప్పించింది. కె. విశ్వనాథ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|