యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
ప్రేయసి కోసం బుజ్జిగాడు శోధన
- డీవీ
షడ్‌రుచుల సమ్మేళనంగా అన్నీ కలగలిపి తీసిన చిత్రమే బుజ్జిగాడు మేడిన్ చెన్నై. హిట్ ఫెయిర్ పెయిర్ ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, సంజన, కోటశ్రీనివాసరావు, సునీల్, అలీ తదితరులు నటించారు. క్రేజీ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందించిన ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ బేనరుపై కేఎస్ రామారావు నిర్మించారు. సంగీతం సందీప్ చౌతాలా అందించారు.

కథ:
విశాఖపట్నంలోని ఓ కాలనీలో హేమ, ప్రభాస్‌రాజు (ఎంఎస్ నారాయణ)ల కొడుకు లింగరాజు అలియాస్ బుజ్జిగాడు (ప్రభాస్). వారింటి పక్కనే ఉన్న ఆహుతి ప్రసాద్ కుమార్తె చిట్టి (త్రిష). వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకానొక సందర్భంలో పన్నెండేళ్ల పాటు తనతో మాట్లాడవద్దని.. చూడవద్దని బుజ్జిగాడితో చెబుతుంది చిట్టీ. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటుంది.

దీంతో బుజ్జిగాడు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి చెన్నై చేరుకుని అక్కడి సినీ సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానిగా చిన్నపాటి గొడవలు చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు (12 ఏళ్ల తర్వాత) తన చిన్ననాటి స్నేహితురాలు చిట్టీ గుర్తుకొచ్చి చెన్నై నుంచి విశాఖకు వస్తాడు.

విశాఖలో తన స్నేహితుడు సత్తిని ఆదుకునే ప్రయత్నంలో జైల్లో ఇరుక్కుంటాడు. అక్కడ ఇద్దరు గూండాలు వీడు పోలీసులనే కొట్టి జైలుకొచ్చాడని తెలుసుకుని తమపని చేయగల సమర్ధుడు అని భావించి ఓ మర్డరు చేస్తే కోటి రూపాయలిస్తామని బుజ్జిగాడికి చెబుతారు.

తను చంపాల్సింది మాఫియా డాన్ శివన్న (మోహన్‌బాబు)నని.. అలాగే తన ప్రేయసి చిట్టి కూడా హైదరాబాద్‌లోనే ఉందని తెలుసుకుని అక్కడికి బయలుదేరుతాడు. శివన్నను చంపితే డబ్బులిస్తామని చెప్పిన వారు ప్రత్యర్థి అయిన మాచిరెడ్డి కుమారులు. ఓ రాత్రి శివన్నను చంపడానికి పథకం పన్ని అతని అనుచరుల్ని చితకబాదినప్పటికీ.. శివన్న చేతిలో తన్నులు తిని అతని సంరక్షణలోనే ఉంటాడు బుజ్జిగాడు.

ఈ విషయం తెలీక జైలు నుంచి వచ్చిన మాచిరెడ్డి కొడుకులు శివన్నపై అటాక్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా బుజ్జిగాడు అడ్డువస్తాడు. షాక్ తిన్న మాచిరెడ్డి కొడుకులు ముందుగా బుజ్జిగాడినే మర్డర్ చేసి ఆ తర్వాత శివన్నను అంతం చేయాలనుకుంటారు. ఆ తర్వాత బుజ్జిగాడు తన ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొన్నాడు.. చిట్టి పరిస్థితి ఏమయింది..అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ మంచి యాక్షన్‌ను కనబరిచాడు. కాకపోతే... ఓ సందర్భంలో శివన్న.. మాచిరెడ్డితో గల స్పర్ధలను వివరిస్తున్న సమయంలో ప్రత్యర్థి వర్గం కాల్పులు జరుపుతాయి. ఆ తర్వాత ఆ టాపిక్ ఊసే ఉండదు. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన చిట్టి లండన్‌లో చదువుకుంటున్నా.. ఆమె బుజ్జిగాడినే ఇష్టపడటం వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నా సినిమా పరంగా ఫర్వలేదులే అనిపిస్తుంది.

ఇక టెక్నికల్‌గా చూస్తే పాటల్లో.. ఏమీ చదువుకోని బుజ్జిగాడు అంగ్లపదాలను వల్లిస్తుంటాడు. శ్యామ్‌కే నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. సందీప్ చౌతాలా సంగీతం అలా పాటల్లో సాగుతూ ఉన్నట్లనిపిస్తుంది. మొత్తంపై కథ పాతదే అయినప్పటికీ ప్రభాస్, మోహన్‌బాబుల వైవిధ్య కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రేక్షకులే దీని భవతవ్యం తేల్చాల్సి ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు
పవన్ అభిమానులకు జల్సా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
అక్టోబర్‌లో హిందీ గజిని
దక్షిణాదిన మంచి హిట్ కొట్టిన గజిని చిత్రం హిందీలోను రూపొందుతున్న విషయం విదితమే.
రీరికార్డింగ్‌లో బ్లాక్ అండ్ వైట్
మావోయిస్టులపై చిత్రం
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...