|
| అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి |
భారీ అంచనాలతో విడుదలైన విడుదలైన చిత్రం ఎన్టీఆర్ కంత్రి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. చిత్రంలో ఎన్టీఆర్, హన్సిక జంటగా నటించారు. మిగిలిన పాత్రలు తనీషా, ప్రకాష్ రాజ్, షిండే, ముఖేష్ రుషి, మురళీ శర్మ, ధర్మవరపు, జయప్రకాష్ రెడ్డి తదితరులు పోషించారు. సంగీతం- మణిశర్మ, కెమెరా- సమీర్ రెడ్డి, దర్శకత్వం- మెహర్ రమేష్.
కథ: తన తల్లిదండ్రులను నమ్మించి మోసం చేయడంపాటు వారిని కిరాతకంగా హత్య చేసిన విలన్ (ప్రకాష్‌రాజ్)పై హీరో (ఎన్టీఆర్) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ముఖ్యాంశం. సొంత ఊరిలో ప్యాక్టరీ పెట్టాలనుకున్న హీరో తల్లిదండ్రులను విలన్ పోతురాజు (ప్రకాష్‌రాజ్) హత్య చేసి, వాళ్లు బ్యాంకు నుంచి తీసుకొస్తున్న కోటి రూపాయలతో పరారవతాడు.
సహచరుడు (ఆశిష్ విద్యార్థి)తో ఊరు విడిచి వెళ్లేక్రమంలో పోతురాజు భార్యబిడ్డలను కూడా వదలిపెడతాడు. అనంతరం నగరానికి చేరుకొన్న పోతురాజు అరాచకాలతో డాన్ స్థాయికి ఎదుగుతాడు. విదేశాలకు కూడా నెట్‌వర్క్‌ను విస్తరించి అక్కడ నుంచే తన కార్యకలాపాలు సాగిస్తుంటాడు.
చీకటి సామ్రాజ్యాధిపతిగా మారిన పీఆర్ (పోతురాజు) భారత్‌లో దొంగనోట్ల వ్యాపారాన్ని సహచరుడు ఆశిష్ విద్యార్ధి ద్వారా సాగిస్తుంటాడు. పీఆర్ అనుచరులు, షాయాజీ షిండే (మరో విలన్) అనుచరులకు మధ్య గొడవల ద్వారా హీరో (ఎన్టీఆర్) ఆశిష్ విద్యార్థి నిర్వహిస్తున్న దొంగనోట్ల వ్యాపారంలోకి అడుగుపెడతాడు.
అనంతరం పీఆర్‌ను కలుసుకోవడం, వాళ్ల ముఠా నుంచి ఓ సందర్భంలో హీరో బయటకు వచ్చి షాయాజీ షిండేతో చేతులు కలపడం చకచకా జరిగిపోతాయి. ఈ క్రమంలో పీఆర్‌ను చంపేందుకు హీరో డబ్బులు కూడా తీసుకుంటాడు. అనంతరం తానుంటున్న అనాథాశ్రమాన్ని చూసుకునే (కోటా శ్రీనివాసరావు) ఫాదర్ ద్వారా తాను పీఆర్ కొడుకునని హీరోకు తెలుస్తుంది.
హీరోకు పీఆర్‌పై ఉన్న ద్వేషాన్ని పోగొట్టి కోటా శ్రీనివాసరావు తండ్రికొడుకులను కలుపుతాడు. తరువాత పీఆర్‌కు ఆశిష్ విద్యార్ధి దూరమయి షాయాజీ షిండేతో చేతులు కలుపుతాడు. చివర్లో పీఆర్‌తో సహా మిగిలిన విలన్లందరినీ మోసగించిన హీరో ఎన్టీఆర్ వాళ్లు అప్పటివరకు సంపాదించిన వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని చాకచక్యంగా కొట్టేస్తాడు.
ఈమధ్యలో హీరోయిన్ హన్సికతో క్రాంతి ప్రేమాయణం సాగిస్తాడు. మధ్యలో వచ్చే మరో హీరోయిన్ తనీషా (అశిష్ విద్యార్థి కూతురు) కూడా క్రాంతిపై మనసు పారేసుకుంటుంది. క్రాంతి అసలు పీఆర్ కొడుకే కాదని క్లైమాక్సులో విలన్లకు తెలిసిపోతుంది. క్రాంతి అసలు ఎవరి కొడుకు, అలా ఎందుకు చేశాడనే దానిని సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమాకు ఎన్టీఆర్ నటన, డాన్సులు, హాన్సికా అందం ప్లస్ పాయింట్లు. ఎన్టీఆర్, హన్సిక జంట చూడముచ్చటగా ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ మార్కు డాన్సులు ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఫస్టాఫ్‌లో హీరోయిన్ వరలక్ష్మి (హన్సిక) అదృష్టాన్ని పండించేందుకు దర్శకుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపాడనిపిస్తుంది.
సినిమాలో కామెడీ పర్వాలేదనిపించింది. మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ఎన్డీఆర్ మాస్ తరహా యాక్షన్‌ను దర్శకుడు కొన్నిచోట్ల సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. పాటలన్నీ జనాలకు ఏ స్థాయిలో యమదొంగ విజయం తర్వాత మరో మెగాహిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|