|
| తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం |
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో చిత్రీకరించారు. మణిశర్మ స్వరకల్పన చేసిన ఈ చిత్ర ఆడియోను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది.
తన కుమార్తెలకు సాంపద్రాయబద్దంగా వివాహం చేయాలనుకున్న క్రమంలో ఓ తండ్రి పడే ఆవేదనకు సంబంధించిన అంశాన్ని కీలకంగా తెరకెక్కించారు. కథలోకి వెళ్తే... ఓ ఊరికి పెద్దయిన నీలకంఠం (ప్రకాష్‌రాజ్) తన పెద్దకుమార్తె పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు చేయిస్తాడు. అయితే ఆ సమయంలో నీలకంఠం పెద్దకుమార్తె ఇంట్లోంచి వెళిపోతుంది.
తన కుమార్తెను తీసుకెళ్లిన అతగాడిని (బాబు) వెతుకుతూ, అతని తల్లిదండ్రులను నిలదీస్తారు. అయితే వారు తమ కొడుకు చచ్చాడనుకుంటాం అంటారు. చివరగా అతని స్నేహితులైన సునీల్, శ్రీనివాసులురెడ్డిలను పట్టుకుని చితగ్గొడితే బాబుకు సంబంధించి మరికొంతమంది స్నేహితుల వివరాలను వెల్లడిస్తారు.
ఆ స్నేహితుల్లో కృష్ణ (అల్లు అర్జున్) ఒకడు. నీలకంఠం బంధువర్గం అతన్ని పట్టుకుని బంధించగా.. వారి చెర నుంచి పారిపోవాలనుకుంటాడు. అయితే ఆ సమయంలో ఓ అమ్మాయిని చూసి ఆమె ఊహల్లో అలాగే అలోచిస్తూ ఉండగా.. ఈలోగా నీలకంఠం బంధువర్గం వచ్చి కృష్ణను మళ్లీ బంధిస్తుంది.
నీలకంఠం రెండో కుమార్తె మీనా (షీలా)... తన గదిలో అక్క ప్రేమలేఖలు ఉన్న విషయం తెలిసి వాటిని కాల్చేయాల్సిందిగా పనిమనిషికి చెబితే.. ఆమె వాటిని తొందరలో కొట్టంలో పడేస్తుంది. అక్కడ అప్పటికే బంధింపబడి ఉన్న కృష్ణ వాటిని చదివి.. అనుకోకుండా తన ప్రియురాలిని వెతికే బాధ్యత నీదేనంటూ మీనాను బ్లాక్‌మెయిల్ చేస్తాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|