|
| వినోదాన్ని పంచే భలే దొంగలు |
తరుణ్, ఇలియానా జంటగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భలే దొంగలు చిత్రం ఆధ్యంతం వినోదంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. జగపతిబాబు ఓ ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రంలో వేణుమాధవ్, సన, చంద్రమోహన్, సుధ, అన్నపూర్ణ, సునీల్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు.
బెల్లంకొండ సురేష్ సమర్పణలో శాఖమూరి పాండురంగారావు నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ చిత్రం ఫే రాధాకృష్ణ సంగీతాన్ని అందించారు. ఇంటినుంచి పారిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి చేసే చిలిపి దొంగతనాలకు ఓ పోలీస్ ఆఫీసర్ చెక్ పెట్టే కథతో ఈ చిత్రం తెరకెక్కింది.
కథా విషయానికొస్తే రాము అనే రోమియో (తరుణ్) గొప్పవాడు కావాలని ఇంటినుంచి పారిపోతే, జ్యోతి అనే జూలియట్ (ఇలియానా) మోడల్ కావాలని ఇంటినుంచి పారిపోతుంది. అలా పారిపోయి వచ్చిన వీరిద్దరూ అనుకోకుండా ఒకటవుతారు. ఈ సందర్భంలో వీరికి ఎదురైన అనుభవాల దృష్ట్యా దొంగలుగా బ్రతకడమే మేలనే నిర్ణయానికి వస్తారు.
అలా దొంగతనాలు చేసి బ్రతకడం ప్రారంభిస్తారు. అయితే వీరి దొంగతనాల బారి నుంచి ప్రజలను కాపాడడానికి డీసీపీ యుగంధర్ (జగపతిబాబు) రంగంలోకి దిగుతాడు. దాంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు, తరుణ్, ఇలియానా ప్రయత్నాలు వారిని పట్టుకోడానికి జగపతిబాబు పాట్లు కలిసి చూసే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి.
చివరకు జగపతిబాబు వారిని పట్టుకోగలిగాడా, వారిని ఎలా సన్మార్గంలో పెట్టాడు అనేదే చిత్రం క్లైమాక్స్. చిత్రం విశ్లేషణ గురించి చూస్తే తరుణ్ తన పాత్రలో ఒదిగిపోయి కామెడీని బాగానే పండించాడు. తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఇలియానా ఈ చిత్రంలో కాస్త నటనను సైతం ప్రదర్శించింది.
జగపతిబాబు పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించాడు. కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. దర్శకుడు హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడనే విషయం తెలుస్తున్నా తన మార్కు ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక ఐటం సాంగ్‌లో ఛార్మీ తన అందాలతో ప్రేక్షకులు టికెట్ కోసం చేసిన ఖర్చుకు బోనస్ అందించింది. చిత్రంలోని సంభాషణలు సైతం విజయభాస్కర్ మార్కుతో బాగానే పేలాయి. రాధాకృష్ణ అందించిన సంగీతం సైతం మెప్పించగలిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|