|
| మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు | |
కొద్దిరోజులకు అర్చనను వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన వినోద్‌కుమార్ తన గూండాలతో కలిసి ఆ చోటులో పెద్ద భీభత్సాన్ని సృష్టిస్తాడు. ఈ గొడవలో కాళిదాసు స్నేహితుడు (సునీల్) చనిపోతాడు. దీంతో తట్టుకోలేకపోయిన కాళిదాసు అర్చన సెల్‌ఫోన్ ద్వారా ఆమె విషయాలు సేకరించి ఆమె గురించి తెలిసిన వారిని సంప్రదిస్తాడు.
అప్పుడు అర్చన గురించి వారు చెప్పిన విషయాలు విని కాళిదాసు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు అర్చన ఎవరు అనే విషయాలు తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో మొత్తంగా చూస్తే కాళిదాసు పాత్ర ద్వారా సుశాంత్‌ను ప్రేక్షకులకు దగ్గరకు చేయాలనే ప్రయత్నం కన్పిస్తుంది.
అయితే సుశాంత్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసేలాగా లేదు. డాన్సులు, ఫైట్లు బాగా చేసిన అభినయంలో మాత్రం అంతంత మాత్రంగానే చెప్పవచ్చు. ఇక తమన్నా నేటి కాలం హీరోయిన్‌లా ఎక్స్‌ఫోజింగ్‌కు, పాటలకు మాత్రమే పరిమితమైంది. ఇక విలన్‌గా వినోద్‌కుమార్ మెప్పించే ప్రయత్నం చేశాడు.
చక్రి ఈ చిత్రానికి అందించిన సంగీతం ఫర్వాలేదని చెప్పవచ్చు. అయితే సందర్భం లేకుండా వచ్చే పాటలు విసుగు తెప్పించకమానవు. గతంలో హీరో, హీరోయిన్లుగా చేసిన సంతోష్‌పవన్‌దేవ్ జయసుధ కొడుకుగా, నిఖిత ఐటంసాంగ్‌లో కన్పించడం కొసమెరుపులు. సుశాంత్‌ను హీరోగా పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి మరి.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|