|
| మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు |
శ్రీనాగ్ కార్పోరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల నిర్మించిన కాళిదాసు చిత్రానికి కొత్త దర్శకుడు జి. రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహించంగా, చక్రి సంగీతాన్ని అందించారు. అక్కినేని నట వారసునిగా తెలుగుతెరకు పరిచయమైన సుశాంత్, తమన్నా జంటగా నటించిన ఈ కాళిదాసు చిత్రం మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది.
కథ విషయానికొస్తే తనను ఆదుకున్న ఓ మాతృమూర్తి కుటుంబానికి సాయపడే వ్యక్తి కథగా ఈ కాళిదాసు చిత్రం తెరకెక్కింది. కాళిదాసు (సుశాంత్) చిన్నతనంలో గూండా అయిన జీవా వల్ల తన తండ్రిని కోల్పోతాడు. దీంతో చిన్నవాడైన కాళిదాసు జీవాను చంపేస్తాడు. ఆ సమయంలో గూండాలు వెంబడించడంతో పారిపోయి ఓ గుడిలో దాక్కుంటాడు. అక్కడ జయసుధ కాళిదాసును చూచి తనతో తీసుకెళ్లి కన్నబిడ్డలా చూచుకుంటుంది.
ఆ సమయంలో జయసుధ కొడుక్కి ఆరోగ్యం బాగోలేక భాదపడుతుంటే అప్పు వసూలు కోసం వచ్చిన ఓ రౌడీ వారి వద్ద ఉన్న డబ్బును బలవంతంగా లాక్కుపోతాడు. దీంతో కాళిదాసు ఆ రౌడీని చితక్కొట్టి, అతనొచ్చిన కారులోనే బయలుదేరి గుంటూరు చేరుకుంటాడు. అక్కడ దొంగ కార్లు కొనే చలపతిరావుతో కలిసి కార్ల దొంగతనాన్నే వృత్తిగా చేసుకుంటాడు.
ఇలా సంపాదించే డబ్బుతో తనను ఆదరించిన జయసుధ కొడుకును హైదరాబాద్‌లో ఉంచి చదివిస్తాడు. అలాంటి తరుణంలో కాళిదాసు దొంగిలించిన ఓ కారుతో సహా అర్చన (తమన్నా) కాళిదాసు దగ్గరకు చేరుతుంది. అయితే ఆమె పిచ్చిదానిలా ప్రవర్తిస్తుండడంతో ఆమెకు సంబంధించిన విషయాలను కాళిదాసు తెలుసుకోలేకపోతాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|