|
| పవన్ అభిమానులకు జల్సా |
పవన్‌కళ్యాణ్ హీరోగా ఇలియానా, కమిలినీముఖర్జీ, పార్వతీమెల్టన్ హీరోయిన్లుగా త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం పవన్‌కళ్యాణ్ అభిమానులకు నిజంగా జల్సాలాంటిదే. చాలాకాలం తర్వాత పవన్‌కళ్యాణ్ గ్లామర్‌గా, ఎనర్జిటిక్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీకరణ సమయంనుంచే అభిమానుల్లో ఓ రకమైన అంచనాలను క్రియేట్ చేసింది.
అలాగే ఈ చిత్రం ప్రమోట్ విషయంలో సైతం నిర్మాతలు కొత్త పంధాకు శ్రీకారం చుట్టడంతో చిత్రం విడుదలనాటికి ప్రతి ఒక్కరిలోను ఓ చిన్నపాటి ఉత్సుకతను రేపింది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం సైతం ముందుగానే విజయం సాధించడం కూడా ఈ చిత్రానికి ఓ ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ఈ చిత్రం కథ గురించి చెప్పాలంటే నక్సలైట్‌గా ఉన్న వ్యక్తి జనజీవన స్రవంతిలో కలిసిపోయి జల్సాగా జీవించాలని కోరుకుంటే ఎలా ఉంటుందన్న పాయింటుకు దృశ్యరూపమే ఈ చిత్రం. ఈ పాయింట్‌ను దర్శకుడు త్రివ్రిక్రమ్ తనదైన విధానంలో తెరకెక్కించాడు. పవన్ సైతం ఈ కథలో ఒదిగిపోయి తనపాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు.
కథా విషయానికొస్తే రాయలసీమ ప్రాంతంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సంజయ్ (పవన్‌కళ్యాణ్) చిన్ననాటి నుంచి పేదరికం భాదల్ని చవిచూస్తాడు. సరైన వైద్యం లేక తన అన్నని పోగొట్టుకుంటాడు. అలాగే నకిలీ పురుగుమందులతో పంట చేతికి రాక తండ్రిని పోగొట్టుకుంటాడు. అటుపై తన తల్లిని సైతం పోగొట్టుకుంటాడు.
తన తల్లితండ్రుల శవాలను శ్మశానానికి తీసుకెలుతున్న సమయంలో తన కాలికి తగిలిన రాయిని కోపంతో పెకలించి వేస్తాడు. అయితే అది ఫ్యాక్షనిస్టు అయిన ముఖేష్‌రుషి పొలానికి చెందిన హద్దు రాయి కావడంతో అతని మనుషులు పవన్‌పై దాడి చేశ్తారు. వారికి బుద్ధి చెప్పిన పవన్ వారి దురాగతాలను ఎదిరించడానికి నక్సలిజం బాట పడుతాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|