|
| ఆకట్టుకోని కామెడీ జాన్‌అప్పారావు 40ప్లస్ |
కృష్ణభగవాన్ హీరోగా, సిమాన్ర్ హీరోయిన్‌గా దర్శకుడు వెంకట్ కూచిపూడి స్వీయనిర్మాణంలో నిర్మించిన చిత్రం జాన్‌అప్పారావు 40ప్లస్. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రుతిక, అలీ, జీవా, వేణుమాధవ్, రఘుబాబు, జీవా, తిరుపతిప్రకాష్ తదితరులు నటించారు. సినిమా గురించి విశ్లేషించాలంటే కృష్ణభగవాన్ హీరోగా అనగానే పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా ఊహించుకుని వచ్చే ప్రేక్షకులకు పూర్తి నిరాశకలగక మానదు.
అలాగే కామెడీ పేరుతో ద్వందార్ధాల స్ధాయి నుంచి అలాంటి తరహా కామెడీని ఇష్టపడేవారు కూడా మూతిమాడ్చుకునే స్టేజికి ఇందులో కామెడీ దిగజారింది. అలాగే కథ విషయానికొస్తే హీరోపాత్రకు, ఓ పెద్ద క్రిమినల్‌కు ఒకే పోలికలున్నట్టు దర్శకుడు మలచిన తీరు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. కథ, కథనంలో కనిపించే లోపాలు సినిమా గమనంలో ప్రేక్షకునికి విసుగు తెప్పిస్తాయి.
కథా విషయానికొస్తే చిత్రంలోని హీరో కృష్ణభగవాన్ దాదాపు నలభైఏళ్లు వచ్చినా పెళ్లికాని పరిస్థితి. అందుకు కారణం అతనికి ఉన్న చెల్లెల్ల పెళ్లి భాద్యత. అందరికి చక్కగా పెళ్లి చేసి భాద్యతలు తీర్చుకునే సరికి అప్పారావు వయస్సు అమాంతం పెరిగిపోయింది. ఫ్యాషన్ డిజైనర్‌గా చేసే అప్పారావుకు భాద్యతలన్నీ తీరిపోవడంతో ఆతని మిత్రబృంధం అతనికి పెళ్లి చేయడానికి ప్రయత్నాలు సాగిస్తారు.
ఈ ప్రయత్నంలో పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతిచోట అప్పారావు వయస్సు అతనికి చిక్కులు తెచ్చిపెడుతుంది. అప్పారావు వయస్సు తెలుసుకుని పెళ్లికూతురి తరపువారు అతనికి పిల్లనివ్వడానికి కాదంటారు. ఇలా పలుమార్లు జరగడంతో విరక్తి చెందిన అప్పారావు తనకు పెళ్లే కాదని నిరాశపడుతున్న సమయంలో ఓ అపరిచితుడు కనబడి త్వరలోనే ఓ అందమైన అమ్మాయి అతన్ని వెతుక్కుంటూ వస్తుందని చెబుతాడు.
అదేసమయంలో ప్రవల్లిక (సిమ్రన్) అప్పారావుకు ఫోన్ చేసి అతను డిజైన్ చేసిన డ్రస్ వల్ల అందరూ తనను పొగిడారని, తనతోబాటు లండన్ రమ్మని పిలుస్తుంది. ఆ చనువు చూసిన అప్పారావు ప్రవల్లిక తనను ప్రేమిస్తోందని అనుకుంటాడు. అయితే రిపోర్టర్ అయిన ప్రవల్లిక అప్పారావును లండన్ తీసుకెళ్లడానికి కారణం వేరే ఉంటుంది. జాన్ అనే ఓ టెర్రరిస్ట్ అచ్చం మన అప్పారావు పోలికలతోనే ఉండడం వల్ల జాన్ ఇంటర్హ్యూ సాధించడానికి అప్పారావును ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ప్రవల్లిక ఇదంతా చేస్తుంది.
కానీ ఓ సమయంలో ఈ విషయం అప్పారావుకు తెలుస్తుంది. ఆప్పుడు అప్పారావు ఎలా స్పందించాడు. చివరకు ఈ కథ ఎక్కడకు చేరింది. అన్న విషయాలతో కథ ముగుస్తుంది. ఈ సినిమా ప్రారంభానికి ముందు చిత్రం గురించి దర్శకుడు చెప్పిన స్థాయిలో మాత్రం ఈ సినిమాలేదనే చెప్పవచ్చు.
ఇక సిమ్రన్ అట్రాక్షన్ కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింటేమీ కాలేదు. ఈ చిత్రంలో కృష్ణభగవాన్ పెళ్లి చూపుల సన్నివేశాల్లో వచ్చే డైలాగులు కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ఇబ్బందే. కథ, కథనంతో సహా చిత్రంలోని అన్ని విభాగాలు ప్రేక్షకుని సహానానికి పరీక్ష పెట్టేవే. ఈ చిత్ర దర్శకుడు కూచిపూడి వెంకట్ తొలిచిత్రం మొదటిసినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండో సినిమా కూడా అంతంతమాత్రమనే చెప్పవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|