యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో సావిత్రి బ్యానర్‌పై విక్రమ్‌గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూర్చారు. వేణు మాథవ్ హీరోగా రుతిక, గీతాసింగ్, ప్రియామోహన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, నాగబాబులు మాఫియా డాన్‌లుగా నటించడం విశేషం.

అలనాటి నాగేశ్వరరావు ప్రేమాభిషేకంలోని కాన్సర్ పాయింటుకు కామెడీని మిక్స్ చేసి తీసిన ఈ సినిమా చూస్తే టైటిల్‌కు ఉన్నంత సీన్ సినిమాకు లేదనిపించక మానదు. హిట్ టైటిల్, కాస్త పేరున్న నటీనటులతో వేణుమాథవ్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ప్లాస్‌బ్లాక్‌ని పక్కన పెట్టి కథా విషయానికొస్తే........ రాయలసీమలోని ఓ పల్లెటూరిలో తన బామ్మ తెలంగాణ శకుంతలతో కలిసుంటాడు టాబ్లెట్ నాగేశ్వరరావు (వేణుమాథవ్). ప్రతి చిన్న అనారోగ్యానికి టాబ్లెట్ వేసుకునే అలవాటుండంతో టాబ్లెట్ అన్న పదాన్ని నాగేశ్వరరావుకు ఇంటిపేరుగా మార్చేస్తారు ఊరివారు.

ఇలాంటి నాగేశ్వరరావు తన మామ ఎల్.బి. శ్రీరామ్ కూతురు గీతాసింగ్‌ను ప్రేమిస్తాడు. అయితే కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి 25 లక్షలు తెమ్మంటూ ఎల్.బి. శ్రీరామ్ షరత్తు విధిస్తాడు. దీంతో డబ్బు సంపాదనకు యాడ్ డైరెక్టర్‌గా మారిన నాగేశ్వరరావు డబ్బు సంపాదన పనిలో ఉంటాడు.

ఇదే సమయంలో ఏదో రోగం పేరుతో ఆస్పత్రికి వెళ్లిన నాగేశ్వరరావుకు రిపోర్టు మారిపోవడంతో డాక్టర్ పొరబాటున అతనికి క్యాన్సర్ అని చెబుతాడు. ఈ విషయం విన్న నాగేశ్వరరావు మామ కూతుర్ని మోసం చేయలేక పట్నంలో తాను మరో అమ్మాయిని ప్రేమించానని అబద్ధం చెప్పి పట్నానికి మకాం మారుస్తాడు.

ఇక్కడ సునీల్ మన నాగేశ్వరరావుకు జతకలుస్తాడు. పట్నంలో బతకడానికి నానారకాల పనులు చేస్తున్న సమయంలో ఎవరో ఇచ్చిన సలహా మేరకు యాడ్ డైరెక్టర్‌గా స్థిరపడడానికి ముంబయి చేరుకుంటాడు నాగేశ్వరరావు. అక్కడ రెండు మాఫియా గ్రూపులకు చెందిన శ్రీహరి, నాగబాబులు నిత్యం ఏదో రకంగా గొడవలు పడుతుంటారు.
(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు
పవన్ అభిమానులకు జల్సా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...