|
| శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
|
గత కొన్ని సంవత్సరాలుగా హీరో పాత్రల కంటే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీహరి తాజాగా నటించిన భద్రాద్రిలో కూడా తనకున్న మాస్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఆయన నువ్వోస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నారు. అనంతరం ఢీ, వియ్యాలవారికయ్యాలు చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన భద్రాద్రి కూడా ఈకోవలోనే ఉంది.
కథ: భద్రాద్రి అనే ఉరిలో ప్రజల బాగోగులు చూసుకునే పెద్దాయన రంగనాథ్. అతని కొడుకు రఘురామ్ (శ్రీహరి). ఒకసారి ఊరిలో బ్లోఅవుట్ కారణంగా చాలా మంది మరణిస్తారు. పొలాలు కూడా పాడైపోతాయి. ఈ ప్రమాదం అనంతరం ఊరు విడిచిపోతున్న ప్రజలను రంగనాథ్ పక్క ఊరిలోని సొంత పొలాలు ఇచ్చి సాగుచేసుకోమంటాడు. అనంతరం గుర్తుతెలియని రోగంతో 20 మంది పిల్లలు మరణిస్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన రాదు.
ఊరి బాగుకోసం తపించే రంగనాథ్ ఆరోగ్య మంత్రి (జయప్రకాశ్ రెడ్డి)ని తన ఊరికి వైద్యుడిని పంపమని కోరతాడు. ఫలితం లేకపోవడంతో రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి బాధ్యతలను భుజానికెత్తుకున్న రఘురామ్ తన తమ్ముడు చందు (బాలాదిత్య)ను మెడిసిన్ చదివిస్తాడు. చందు మెడిసిన్ చదివిన అనంతరం తన ఊరి ప్రజలు బ్లోఅవుట్ వలన చనిపోలేదని, అది జరిగిన తరువాత ఇచ్చిన మందుల వలన చనిపోయారని కనిపెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|