|
| పాటల చిత్రీకరణలో సుశాంత్ కరెంట్ |
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుశాంత్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం కరెంట్. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బ్యాంకాక్‌లో వారం రోజులపాటు ఓ పాటను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో సుశాంత్‌పై చిత్రీకరించనున్న పాటను ఐదురోజుల పాటు షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అనంతరం మే 4 నుండి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో సుశాంత్, స్నేహా ఉల్లాల్‌లపై చిత్రీకరించనున్న చివరి పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. షూటింగ్ అనంతరం మే మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, మే మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు.
ఈ చిత్రంలో సుశాంత్, స్నేహాఉల్లాల్‌లతోపాటు చరణ్‌రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సునీల్, షఫీ, రఘుబాబు, సుధ, ఝాన్సీ, రష్మీ, విజయ్, కిశోర్, కొండవలస తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం- దేవీశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ- విజయ్ సి. కుమార్, ఫైట్స్- కనల్‌కన్నన్, ఆర్ట్- నారాయణరెడ్డి, ఎడిటింగ్- మార్తాండ్ కె. వెంకటేష్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|