|
| రెగ్యులర్ షూటింగ్ కోసం రవితేజ చిత్రం |
| గురువారం, 23 ఏప్రిల్ 2009 ( 17:24 IST ) | |
రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఆంజనేయులు. యువత ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుంది.
ఈ చిత్ర విశేషాల్ని గురించి నిర్మాత మాట్లాడుతూ రవితేజ కెరీర్‌లో ఈ సినిమా ఓ సెన్సేషనల్ హిట్ చిత్రమవుతుందన్నారు. రవితేజ, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగణం ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారని ఆయన వెల్లడించారు. పరుశురామ్ అద్భుతమైన కథాంశంతో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందిస్తున్నారని, ఏప్రిల్ 20 నుంచి మే 9వరకు హైదరాబాద్‌లో చిత్రీకరణ ఉంటుందన్నారు.
మే 12 నుంచి 25 వరకు విదేశాల్లో పాటలు చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. జూన్‌లో చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసి ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు.
రవితేజ, నయనతార జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్. నారాయణ, సన, వినయప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ- కె. రవీంద్రబాబు, సంగీతం- ఎస్. థామస్, ఎడిటింగ్- మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్- రామ్‌లక్ష్మణ్, ఆర్ట్- చిన్నా, సమర్పణ- రవికిరణ్‌బాబు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|