|
| టాకీ పూర్తి చేసుకున్న ఆ ఇంట్లో |
| 23 ఏప్రిల్ 2009 ( 17:21 IST ) | |
నటుడు చిన్నా దర్శకత్వంలో యు9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై రూపొందుతున్న ఆ ఇంట్లో చిత్రం ఇటీవల టాకీని పూర్తి చేసుకుంది. ఓ ఇంట్లో జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిన్నా నటించడంతోపాటు దర్శకత్వం కూడా వహించడం విశేషం.
ఈ చిత్ర విశేషాల గురించి చిన్నా మాట్లాడుతూ అనుకున్నదానికంటే రెండురోజుల ముందే చిత్రాన్ని పూర్తి చేయగలిగామని అన్నారు. మొత్తం 44రోజుల్లో చిత్రం పూర్తయ్యిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తెస్తామని తెలిపారు.
ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, భిక్షు, ఆహుతిప్రసాద్, రామ్‌జగన్, సుబ్బరాయశర్మ, జూ.రేలంగి, పద్మాజయంతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం- కోటి, డైరెక్టర్ ఆఫ్ పోటోగ్రఫీ- సుధాకర్‌రెడ్డి, నిర్మాతలు- శ్రీనివాసరెడ్డి, రాజుచౌదరి, మనోజ్‌కుమార్‌రెడ్డి, జితేంద్రరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- చిన్నా.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|