|
| రవితేజ, ఇలియానా జంటగా కిక్ టాకీ పూర్తి |
| గురువారం, 9 ఏప్రిల్ 2009 ( 16:06 IST ) | |
రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం కిక్. వి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల నాలుగు పాటలతో పాటు టాకీ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇటీవలే యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో రవితేజ, ఇలియానాలపై రెండు పాటలను చిత్రీకరించామని తెలిపారు. తమిళ హీరో శ్యామ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు, కామెడీని మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ అనుకున్నట్లుగానే చిత్రాన్ని పూర్తి చేశామని, ఈ నెల 19న ఆడియోను విడుదల చేస్తామని, వచ్చేనెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా- రసూల్, సంగీతం- ఎస్. థామస్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|