|
| బ్లాక్ క్యాట్ చిత్రం షూటింగ్ ప్రారంభం |
| గురువారం, 9 ఏప్రిల్ 2009 ( 16:05 IST ) | |
పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బంగారు బయ్యారెడ్డి దర్శక నిర్మాతగా బ్లాక్ క్యాట్ అనే చిత్రం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ బాచుపల్లిలోని జామతోటహౌస్‌లో ఇటీవల ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన షాట్‌కు దర్శకుడు శివాజీ ప్రసాద్ క్లాప్ కొట్టగా, జాజిమల్లి వాసు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటిస్తున్న కృష్ణభగవాన్ మాట్లాడుతూ ఇందులో తనది ముఖ్యమైన పాత్ర అని అన్నారు. గెస్ట్‌హౌస్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమా గురించి బండారు బయ్యారెడ్డి మాట్లాడుతూ సస్పెన్స్ ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందుతోందన్నారు. పదిరోజులపాటు ఈ చిత్రం షూటింగ్‌ను ఇక్కడే నిర్వహించినట్టు తెలిపారు.
ఇక్కడ షూటింగ్ ముగిసిన తర్వాత వరంగల్ ఫారెస్ట్‌లో షూటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్న సన మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను కృష్ణభగవాన్ సరసన నటిస్తున్నట్టు తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం- ప్రేమ్, కెమెరా- బొర్లగడ్డ, పాటలు- డాడీ శ్రీను, తాటిశివ, సమర్పణ- బాబూరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- బంగారు బయ్యారెడ్డి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|