|
| ప్రారంభమైన ప్రభాస్-పూరీల కొత్త చిత్రం |
| 1 ఏప్రిల్ 2009 ( 13:25 IST ) | |
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఏకధాటిగా జూలై వరకు షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం.
ఈ చిత్రం గురించి డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ప్రభాస్‌తో చేస్తున్న మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని అన్నారు. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ మిక్స్ అయ్యి పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న స్టైలిష్ ఫిలిమ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. జూలై నెలాఖరుకల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని, ఆదిత్యరామ్ పతాకంపై తన సమర్పణలో ఈ చిత్రం తయారవుతుందని పూరి అన్నారు.
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా నటిస్తోన్న ఈ భారీ చిత్రానికి సమర్పణ- పూరి జగన్నాథ్, నిర్మాత- ఆదిత్యారామ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- పూరి జగన్నాథ్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|