యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
త్వరలో ప్రారంభం కానున్న అర్చన 'సివంగి'
1 ఏప్రిల్ 2009   ( 13:23 IST )
Archana
PC
అచ్చ తెలుగు హీరోయిన్ అర్చన ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మించనున్న కొత్త చిత్రం సివంగి. తెలుగు క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభంకానుంది.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ కథపరంగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, రెండు పాటలను బ్యాంకాంక్‌లో చిత్రీకరించనున్నట్టు తెలిపారు. నాజర్, భానుప్రియ, చంద్రమోహన్, తెలంగాణా శకుంతల, కొండవలస, సుమన్ శెట్టి, రామిరెడ్డిలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో థ్రిల్లర్ మంజు నటించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో విలన్‌గా నటించనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రం గురించి అర్చన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఎదురుచూశానని, లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తయారవుతోందని పేర్కొంది. నిర్మాత మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న కథ ఇదని, పోలీసు వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు మధ్య జరిగే కథాంశమే ఈ సినిమా అని అన్నారు.

త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి మాటలు- దాసం వెంకట్రావ్, పాటలు- సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, సూరిశెట్టి రామారావు, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్, కెమెరా- అడుసుమిల్లి విజయ్ కుమార్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రవితేజ హీరోగా 'ఆంజనేయులు' ప్రారంభం
మీనా ప్రధాన పాత్రలో 'వెంగమాంబ' ప్రారంభం
బ్యాంకాక్‌లో అధినేత చిత్రం షూటింగ్‌
షూటింగ్ పూర్తి చేసుకున్న 'శ్రీ షిర్డి సాయిబాబా'
50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రం
రాజీవ్, సోనియా కాంబినేషన్‌లో కొత్త చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మళ్లీ తెరమీదకు వచ్చేందుకు 'ఆర్తీ' రెడీ
నువ్వు నాకు నచ్చావ్ అంటూ మెప్పించి అందాలరాముడుతో అలరించిన...
'మనోరమ'ను ఆదరిస్తున్నారు: ఈశ్వర్‌రెడ్డి
మార్చి 31నుంచి ప్రభాస్-పూరీల కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...