యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
రవితేజ హీరోగా 'ఆంజనేయులు' ప్రారంభం
గురువారం, 26 మార్చి 2009   ( 15:02 IST )
Raviteja
PC
'ఇడియట్', 'నేనింతే'లాంటి టైటిల్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రవితేజ తాజాగా "ఆంజనేయులు" అనే పేరుతో తెరపైకి రానున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమా ప్రారంభోత్సవ పూజాకార్యక్రమాలను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరై నిర్వహించారు. ఆయన భార్య రేణూదేశాయ్ క్లాప్ కొట్టగా, బొత్సా సత్యనారాయణ కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రవితేజ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమని అన్నారు. "యువత" దర్శకుడు పరుశురామ్ చేసిన సినిమా చూశానని, చాలా బాగుందన్నారు. అదే దర్శకుడు తన వద్ద కథ చెప్పిన విధానం కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న చిత్రమిదని రవితేజ వెల్లడించారు.

దర్శకుడు పరుశురామ్ మాట్లాడుతూ తనను నమ్మి తనపై రవితేజ పెద్ద బాధ్యతపెట్టారని, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హైలైట్ అవుతుందని, ఏప్రిల్ 20 నుంచి షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా జరుపుతామన్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆహుతిప్రసాద్, చలపతిరావు, రాజారవీంద్ర, జీవా శివన్నారాయణ, రజిత, సన మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా- రవీంద్రబాబు, సంగీతం- థామస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- పరుశురామ్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మీనా ప్రధాన పాత్రలో 'వెంగమాంబ' ప్రారంభం
బ్యాంకాక్‌లో అధినేత చిత్రం షూటింగ్‌
షూటింగ్ పూర్తి చేసుకున్న 'శ్రీ షిర్డి సాయిబాబా'
50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రం
రాజీవ్, సోనియా కాంబినేషన్‌లో కొత్త చిత్రం
చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఛార్మి "మనోరమ" అలరించేనా...?
ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ సంస్థ జీటీవీ నిర్మిస్తోన్న ద్వితీయ చిత్రం 'మనోరమ'. జీటీవీ...
త్రిష హీరోయిన్‌గా ఆకాశమంత ఆడియో
విడుదలకు భార్గవి చివరి చిత్రం హాలీడేస్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...