యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
మీనా ప్రధాన పాత్రలో 'వెంగమాంబ' ప్రారంభం
గురువారం, 26 మార్చి 2009   ( 15:00 IST )
Vengamamba
PC
మీనా ప్రధాన పాత్రలో వి. దొరస్వామిరాజు నిర్మాతగా వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం వెంగమాంబ. ఈ భక్తిరస చిత్రంలో సాయికుమార్ శ్రీ వేంకటేశ్వరునిగా నటిస్తుండగా మీనా వెంగమాంబగా నటిస్తోంది. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీనా, సాయికిరణ్‌పై ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి డి.వి.ఎస్. రాజు క్లాప్ కొట్టగా, రమేష్ ప్రసాద్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ సాహిత్యాన్ని వెలుగులోకి తెస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో వెంగమాంబపై సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. విప్లవభావాలతో కూడిన భక్తిరస చిత్రమిదని ఉదయభాస్కర్ వెల్లడించారు.

నిర్మాత మాట్లాడుతూ ఇప్పటికే ఎస్.వి. ఛానెల్‌లో సీరియల్‌గా ప్రసారమవుతున్న కథను సినిమాగా మలిచే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నానక్‌రామ్‌గూడాలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ నిర్వహిస్తామని, జూన్ వరకు సాగే షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం 12 పాటలుంటాయని, అందులో ఆరు వెంగమాంబ రాసినవేనని ఆయన వివరించారు.

తిరుమల తిరుపతి ఆలయంలో ప్రతినిత్యం శ్రీవారికి పవళింపు సేవ అనంతరం ఇచ్చే ముత్యాల హారతి ఈ వెంగమాంబ రచించిందే కావడం విశేషం. కీ.శ. 17, 18 శతాబ్దంలో జీవించిన ఈ కవయిత్రి విప్లవ భావాలు గల యువతి. ఆనాడు ఆమె వేసిన తొలి అడుగే ఆ తర్వాత కాలంలో స్త్రీకి విద్యా, ఉద్యోగాల విషయంలో ముందడుగైంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్యాంకాక్‌లో అధినేత చిత్రం షూటింగ్‌
షూటింగ్ పూర్తి చేసుకున్న 'శ్రీ షిర్డి సాయిబాబా'
50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రం
రాజీవ్, సోనియా కాంబినేషన్‌లో కొత్త చిత్రం
చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం
కొత్తవారితో 'టు-లెట్' చిత్రం షూటింగ్ ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఛార్మి "మనోరమ" అలరించేనా...?
ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ సంస్థ జీటీవీ నిర్మిస్తోన్న ద్వితీయ చిత్రం 'మనోరమ'. జీటీవీ...
త్రిష హీరోయిన్‌గా ఆకాశమంత ఆడియో
విడుదలకు భార్గవి చివరి చిత్రం హాలీడేస్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...