యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం షూటింగ్ ముచ్చట్లు
బ్యాంకాక్‌లో అధినేత చిత్రం షూటింగ్‌
గురువారం, 26 మార్చి 2009   ( 14:59 IST )
Adhinetha
PC
జగపతిబాబు హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం అధినేత. ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ బ్యాంకాక్, పట్టాయ, పుకెట్ దీవులలో జరిగే షూటింగ్ సందర్భంగా పాటలను చిత్రీకరించడం ద్వారా మొత్తం షూటింగ్ పూర్తికానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల ఖమ్మంలో 20వేల మందికి పైగా జనం మధ్య హెలికాప్టర్స్, వందలాది ఆటోలతో చిత్రీకరించారు. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా ఈ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. దీంతో ఈ నెల 24 వరకూ జరిగిన షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ ఏప్రిల్ 10న అధినేత చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ జగపతిబాబు చేస్తున్న పవర్‌ఫుల్ పొలిటికల్ ఫిల్మ్ ఇదని అన్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతి ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- పరుచూరి బ్రదర్స్, సంగీతం- శ్రీకాంత్ దేవా, కెమేరా- ప్రసాద్ బాబు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న 'శ్రీ షిర్డి సాయిబాబా'
50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రం
రాజీవ్, సోనియా కాంబినేషన్‌లో కొత్త చిత్రం
చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం
కొత్తవారితో 'టు-లెట్' చిత్రం షూటింగ్ ప్రారంభం
పాట చిత్రీకరణలో సుశాంత్ హీరోగా "కరెంట్"
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఛార్మి "మనోరమ" అలరించేనా...?
ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ సంస్థ జీటీవీ నిర్మిస్తోన్న ద్వితీయ చిత్రం 'మనోరమ'. జీటీవీ...
త్రిష హీరోయిన్‌గా ఆకాశమంత ఆడియో
విడుదలకు భార్గవి చివరి చిత్రం హాలీడేస్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...