|
| షూటింగ్ పూర్తి చేసుకున్న 'శ్రీ షిర్డి సాయిబాబా' |
| 19 మార్చి 2009 ( 14:38 IST ) | |
ఎస్.ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి బాబా పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విశేషాల గురించి బి.వి.రెడ్డి మాట్లాడుతూ ఏలూరు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుకున్న విధంగా, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని అన్నారు.
బాబా మహిమలతో కొమ్మనాపల్లి గణపతిరావు అద్భుతమైన కథను అందించారని, ఈ నెలలోనే ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నామని బి.వి.రెడ్డి వెల్లడించారు.
దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత గల ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయని చెప్పారు. ప్రేక్షకులకు ఒక్కసారి బాబా చరిత్రను గుర్తుచేసే విధంగా తమ చిత్రం ఉంటుందని ఆయన తెలిపారు. మతంకన్నా మానవత్వం గొప్పదనే పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుందని గణపతిరావు వివరించారు.
సుమన్, నాగబాబు, శివకృష్ణ, నారాయణ శాస్త్రి, రమాప్రభ, శివపార్వతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా- కె. శ్రీనివాసరెడ్డి, సంగీతం- లలిత్ సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- జి. రామకృష్ణ.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|