|
| 50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రం |
| గురువారం, 19 మార్చి 2009 ( 14:37 IST ) | |
అష్టాచమ్మా ఫేం నాని కథానాయకుడిగా, నచ్చావులే ఫేం మాధవీలత నాయికగా జెమినీ సర్క్యూట్ సమర్పణలో ఓ కొత్త చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 50 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నెల 17 నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ విభిన్న ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అన్నారు. కేవలం ప్రేమే ప్రధానాంశంగా కాకుండా సకుటుంబ సమేతంగా చూసేలా ఈ చిత్రంలో పలు అంశాలను చేర్చి వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. "ప్రియమైన నీకు" చిత్రానికి సంగీతం అందించిన శివశంకర్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారని, మాటల రచయిత భాషాశ్రీ సంభాషణలు ఎంతో సహజంగా ఉంటాయని దర్శకుడు వివరించారు.
ఏప్రిల్ 10తో ముగిసే షెడ్యూల్తో ఈ చిత్రం పూర్తవుతుందని, మేలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమేరా- వాసు, మాటలు, పాటలు- భాషాశ్రీ, ఆర్ట్- సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- సత్యం బెల్లంకొండ.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|