|
| రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోన్న నేనింతే |
రవితేజ హీరోగా యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న "నేనింతే" చిత్రం రెగ్యూలర్ షూటింగ్ గత నెల 21న ప్రారంభం అయింది. ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకుడు. ఇప్పటివరకు కొన్ని యాక్షన్ దృశ్యాలు, టాకీ సన్నివేశాలు చిత్రీకరించారు.
పూరిజగన్నాథ్, రవితేజ కాంబినేషన్‌లో చాలాకాలం తరువాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ ఉన్నాయి. ఈ సినిమా తమ బేనర్‌కు కూడా మంచి పేరు తీసుకొస్తుందని నిర్మాత డి.వి.వి దానయ్య తెలిపారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
"నేనింతే"లో రవితేజ సరసన శ్రేయ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రిత, బ్రహ్మానందం, వేణుమాధవ్, రాజారవీంద్ర, రమాప్రభ, కోవైసరళ తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: చక్రి, ఎడిటింగ్: వర్మ, ఆర్ట్: చిన్నా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరిజగన్నాథ్
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|