యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఫైట్స్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఆటో రాజా
బుధవారం, 20 మే 2009   ( 17:53 IST )
Auto raja
PC
సాయికిరణ్, ప్రాచి అధికారి, నందిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఆటో రాజా". వై.కె. ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై విజయశర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ సునీల్ సాగర్, ఎం.డి.యావర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నీతినిజాయితీ కలిగిన సాధారణ ఆటో డ్రైవర్ తనకు తెలియకుండానే మాఫియా వలలో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి బయటికి రావడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మాఫియాను ఎలా చేధించాడు. అనే అంశాలతో "ఆటో రాజా" సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

"ఆటో రాజా" పాత్రలో సాయికిరణ్ నటిస్తుండగా, మాఫియా డాన్ ప్రతినాయకుడి పాత్రలో మాజీ జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఐదు ఫైట్లతో రసవత్తర సన్నివేశాలను చిత్రీకరించామని దర్శక, నిర్మాతలు అన్నారు.

ఫైట్స్, సాంగ్స్ ఈ చిత్రాన్ని హైలైట్‌గా నిలుస్తాయని, "హైటెక్ గ్రేటర్ హైదరాబాద్ సూపర్ డూపర్ సైబరాబాద్ సరసన ఉన్న శంషాబాద్ ఆటోవాలా జిందాబాద్" అనే పాటను హీరో సాయికిరణ్‌తో పాటు 100 ఆటోలను, 100 మంది ఆటోడ్రైవర్లను డ్యాన్సర్లుగా చేసి హైదరాబాద్ సిటీలో అనేక సెంటర్లలో చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు విజయశర్మ వెల్లడించారు.

జూన్ 10 వరకు జరిగే షెడ్యూల్‌తో ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని, జూలైలో సాంగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

సత్యప్రకాష్, బల్వాన్, రఘునాధరెడ్డి, ప్రసన్న కుమార్, ఏవీఎస్, కొండవలస, కవిత, జయలలిత, తాఫిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా.. జి.కె. నాయుడు, సంగీతం.. భారత్ బంద్ విజయశేఖర్, కథ, మాటలు, పాటలు.. మజ్ను, నృత్యం.. ఆనంద్, ఫైట్స్.. సూపర్ ఆనంద్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
వేసవి వినోదంగా రానున్న అంతిమ పోరాటం
త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
విడుదలకు సిద్ధమైన సుమంత్ "బోణీ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...