|
| త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3 |
| మంగళవారం, 19 మే 2009 ( 17:29 IST ) | |
హాలీవుడ్‌లో మెగాస్నేక్ పేరుతో నిర్మించబడ్డ చిత్రం త్వరలో అనకొండ-3 పేరుతో తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్రిస్తున్నారు. హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని లక్ష్మీ పాండురంగా ఫిలింగ్ బేనర్‌పై ఉమామహేశ్వరరెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు.
ఈ విషయమై ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు వచ్చిన అన్ని అనకొండ చిత్రాలకంటే ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రం కథ ప్రకారం పాములపై పరిశోధన చేసే ఓ శాస్త్రవేత్త ల్యాబ్‌నుంచి తప్పించుకున్న ఓపాము బయటకు వచ్చాక విపరీతంగా పెరిగి మనుషులపై దాడి చేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించబడిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అనకొండ పాముకు, ఇతర పాత్రలకు మధ్య జరిగే సన్నివేశాలు ఉత్కంఠతను కలిగించేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని నెలాఖరులోగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వివరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|