|
| అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ" |
| సోమవారం, 18 మే 2009 ( 19:20 IST ) | |
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. మీనా, శరత్‌బాబు, రాగిణి, సుధ, సుబ్బరాయ శర్మతో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్టులపై సోమవారం నాడు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మండువాహౌస్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ జూన్ 15వ తేదీ వరకు సాగుతుందని, త్వరలో ఈ చిత్రం లోగోను ఆవిష్కరిస్తామని చిత్ర నిర్మాత వి. దొరస్వామి రాజు తెలియజేశారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవలే రెండు పాటలను భారీఎత్తున చిత్రించామన్నారు. "తారుజువ్వనురా" అనే పాటను ముంబైకి చెందిన అందాల తార తస్మీనాషేక్, కొంతమంది డాన్సర్లపై చిత్రీకరించామని తెలిపారు. సారథిలో వేసిన బ్రహ్మాండమైన సెట్లో తార నృత్య దర్శకత్వంలో ఈ పాటను చిత్రీకరించామన్నారు.
దీంతో రెండు పాటలు, కొంత టాకీతో పాటు తొలి అర్థభాగం సినిమా షూటింగ్ పూర్తయిందని దర్శకుడు వెల్లడించారు. ప్రస్తుతం జరిగే షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తామని, అన్నమయ్య తర్వాత అంతటి మ్యూజికల్ హిట్ చిత్రం చేయడానికి కీరవాణి కృషి చేస్తున్నారు. జూన్ 7న ఆడియోను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.
సాయికిరణ్, రంగనాథ్, ఎల్బీ శ్రీరాం, అశోక్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు.. అన్నమయ్య, వెంగమాంబ, వేటూరి, వేదవ్యాస్, కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం.. ఉదయ్‌భాస్కర్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|