యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
విడుదలకు సిద్ధమైన సుమంత్ "బోణీ"
సోమవారం, 18 మే 2009   ( 19:16 IST )
Boni Still
PC
యూత్ హీరో సుమంత్ కథానాయకుడిగా కృతికరబంద కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బోణీ". గ్రీన్‌ మ్యాంగోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సోమవారం ఈ చిత్రం గురించి అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కథకంటే కథనంగా గొప్పగా ఉంటుందని తెలిపారు.

యూఎస్‌లో యూడ్ ఫిలిమ్స్ చేసిన రాజా తొలిసారిగా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించినా, ఆయన భీమవరంకు చెందిన వారు కావడంతో మన నేటివిటీకి, ఆధునీకత ఆలోచనలకు అనుగుణంగా చిత్రాన్ని మలిచారన్నారు.

నిర్మాత రమణగోగుల క్రియేటివ్ బిజినెస్ చేస్తూనే సినిమాలో కొత్తదనం చూపే రీతిలో ఈ సినిమాను నిర్మించారని సుమంత్ వివరించారు. ఓ ఆశయం కోసం హీరో ఏం చేశాడన్నది కథని సుమంత్ అన్నారు. సంగీత పరంగా రమణగోగుల మ్యూజిక్ ఇప్పటికే ప్రజాదరణ పొందిందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
22న ప్రేక్షకుల ముందుకు 'పిస్తా'
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
రైడ్ ఆడియోను ఆవిష్కరించిన బాలకృష్ణ
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...