|
| వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు |
| శనివారం, 16 మే 2009 ( 18:13 IST ) | |
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ స్రవంతి రవికిషోర్ సోదరి కుమారుడన్న సంగతి తెలిసిందే. రామ్ తన పుట్టినరోజు (15-05-09)ను శుక్రవారం కొండాపూర్‌లోని షూటింగ్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను తాజాగా నటిస్తోన్న చిత్రంలో ఉన్న 25 మంది బాలల సమక్షంలో రామ్ పుట్టిన రోజు జరుపుకోవడం విశేషం.
అదేసమయంలో రెడీ చిత్రం తర్వాత స్రవంతి రవికిషోర్ రామ్‌తో మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. శరవణన్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా లవ్‌స్టోరీతో పాటు కమర్షియల్ అంశాలతో తెరకెక్కనుందని నిర్మాత రవికిషోర్ అన్నారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తనకు ఈ చిత్రం మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. త్వరలో దిల్‌రాజు నిర్మించబోయే చిత్రంలోనూ నటించనున్నట్లు చెప్పారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత రామ్ తన 3వ పుట్టినరోజును జరుపుకుంటున్నట్టు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|